E-Paper
Advertisement

OYO Rooms: వాలంటైన్స్ డే ఎఫెక్ట్.. ఆ ఒక్క రోజే 50 శాతానికి పెరిగిన ఒయో రూమ్ బుకింగ్స్!

OYO Rooms: వాలంటైన్స్ డే ఎఫెక్ట్.. ఆ ఒక్క రోజే 50 శాతానికి పెరిగిన ఒయో రూమ్ బుకింగ్స్!
Advertisement

OYO Rooms: దేశ వ్యాప్తంగా వాలెంటైన్స్ డే నాడు ఒయో రూమ్ బుకింగ్ లు భారీగా పెరిగాయని ఆ సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఐటీ నగరం బెంగళూరులో OYO రూమ్ బుకింగ్‌ల సంఖ్య 51 శాతం పెరిగిందని ప్రకటించింది. దీంతో బెంగళూరు ఒయో బుకింగ్ గమ్యస్థానాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఒయో కంపెనీ ప్రకారం, ఉత్తర్ ప్రదేశ్‌లోని బృందావన్ గత సంవత్సరంతో పోలిస్తే దాని ప్లాట్‌ఫామ్‌లో హోటల్ బుకింగ్‌లలో 231 శాతం పెరుగుదలను నమోదు చేసింది. రెండో స్థానంలో బెంగళూరు 51 శాతం పెరుగుదలను నమోదు చేసింది. హైదరాబాద్ 47 శాతం వృద్ధితో తరువాత స్థానంలో ఉంది.

పెరిగిన ఒయో బుకింగ్స్

ఒయో బుకింగ్‌లు ఎక్కువగా జరిగిన ఇతర నగరాల్లో పూణే (45 శాతం), కోల్‌కతా (38 శాతం), చెన్నై (35 శాతం), ముంబై (19 శాతం) ఉన్నాయి. మొత్తం మీద, ఒయో ప్లాట్‌ఫామ్‌లో వాలెంటైన్స్ డే నాడు హోటల్ బుకింగ్‌లలో దాదాపు 35 శాతం పెరుగుదలను నమోదు చేసింది. సెలవు రోజుల్లో ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారనేదానికి ఇది నిదర్శనం అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
2022లో 2 రోజులుగా ఉన్న సగటు బుకింగ్ వ్యవధి ఈ సంవత్సరం 4 రోజులకు పెరిగిందని ఒయో పేర్కొంది.

హిల్ స్టేషన్ల వద్ద బుకింగ్ లు

Advertisement

“ఎక్కువ మంది టూరిస్టులు.. బీచ్ ల దగ్గర కంటే హిల్ స్టేషన్లను ఎంచుకుంటున్నారు. 2022తో పోలిస్తే 2023లో సగటు స్టే వ్యవధి 2 రోజుల నుంచి 4 రోజులకు పెరిగింది. ఇది స్టే కేంద్రాలలో వినియోగదారుల డిమాండ్‌ను సూచిస్తుంది” అని ఒయో తన నివేదికలో పేర్కొంది. ప్రేమికుల రోజున ఒయో సీఈవో రితేష్ అగర్వాల్..కస్టమర్లు నిజాయితీగల అభిప్రాయాన్ని, ఫిర్యాదులను, విమర్శలను, సూచనలను పంచుకోవాలని కోరారు.

Also Read: టయోటా కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు, ఆ కార్లపై ఏకంగా రూ. లక్ష తగ్గింపు!

కస్టమర్లే ఫస్ట్ లవ్

Advertisement

ఒయో అనేది కస్టమర్ల నుంచి వచ్చిన అభిప్రాయాలతో ఏర్పడిందని రితేష్ తెలిపారు. కస్టమర్లే ఒయో మొదటి లవ్ అన్నారు. ఒయో ఇకపై కస్టమర్ల అభిప్రాయాలను వినడానికి సిద్ధం ఉందన్నారు. కస్టమర్ల అభిప్రాయాలు తెలుసుకునేందుకు.. తమ వెబ్ సైట్ లో ఒక పేజీని ప్రారంభిస్తున్నామన్నారు. ఇక్కడ OYO గురించి కస్టమర్లు తమ అభిప్రాయాన్ని బహిరంగంగా, నిజాయితీగా తెలియజేయవచ్చన్నారు.

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×