BigTV English

Yamaha NMAX Turbo: 155 సీసీతో యమహా కొత్త స్కూటర్.. మతిపోగొడుతున్న ఫీచర్లు!

Yamaha NMAX Turbo: 155 సీసీతో యమహా కొత్త స్కూటర్.. మతిపోగొడుతున్న ఫీచర్లు!

Yamaha NMAX Turbo: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యమహా భారతదేశంలో వివిధ రకాల వాహనాలను విక్రయిస్తోంది. యమహా ఫేమస్ బైక్‌లలో RX 100, Yamaha R15 ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా R15 ఇంజన్‌ని ఉపయోగించి Yamaha కంపెనీ Maxi స్కూటర్‌ను విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. యమహా మ్యాక్సీ స్కూటర్లు వాటి స్ట్రాంగ్ పర్పామెన్స్, అగ్రెసివ్ స్టైలింగ్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాయి. యమహా కంపెనీ N Max అనే స్కూటర్‌ను అనేక ఎక్స్‌పోలలో ప్రదర్శించింది. యమహా ఇటీవల భారతదేశంలో జరిగిన భారత్ మొబిలిటీ షోలో తన కొత్త మ్యాక్సీ స్కూటర్ NMax 155ని ఆవిష్కరించింది.


యమహా కొత్త NMAX టర్బోలో 155cc ఇంజన్ ఉంటుంది. ఇది 15.6hp పవర్, 14.2Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ తన ఏరోక్స్ 155 స్కూటర్‌లో కూడా అదే ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. అయితే ఇక్కడ పవర్, టార్క్‌లో చిన్న మార్పులు చేయబడ్డాయి. కొత్త స్కూటర్ 45mm పొడవు, 50mm పొట్టిగా ఉంది.

Also Read: ఆఫర్ల వర్షం.. మారుతీ కార్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్స్!


భద్రత కోసం కొత్త NMAX స్కూటర్‌లో డ్యూయల్-ఛానల్ ABS ఉంది. ఇది మెరుగైన బ్రేకింగ్‌ ఇస్తుంది. ఇది కాకుండా ట్రాక్షన్ కంట్రోల్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌లో ‘టర్బో వై-షిఫ్ట్’ ఫీచర్ ఉంది. ఇది తక్కువ, మీడియం, హై మోడ్‌లలో పనిచేస్తుంది. దీని కారణంగా యాక్సిలరేషన్, బ్రేకింగ్ మెరుగ్గా ఉంటాయి.

కొత్త స్కూటర్ డిజైన్ ఆకట్టుకుంటుంది. దాని ఫీచర్లు కూడా అద్భుతమైనవి. రాత్రి వేళల్లో వెలుతురు కోసం స్కూటర్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్‌‌లు ఉంటాయి. ఇది కాకుండా LCD స్పీడోమీటర్‌ను కలిగి ఉంది. దీనిలో మీరు నావిగేషన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ స్కూటర్ స్మార్ట్ కీతో వస్తుంది.

యమహా ఇప్పుడు ఈ NMax 155 స్కూటర్ టర్బో మోడల్‌ను తీసుకురానుంది. ప్రస్తుతానికి ఈ స్కూటర్ ఇండోనేషియాలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇది తరువాత ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కావచ్చు. ఈ స్కూటర్‌పై కంపెనీ ఎలక్ట్రిక్ సివిటి గేర్‌బాక్స్‌ను కూడా అందించింది. ఇంతకుముందు ఎరోక్స్ పేరుతో మ్యాక్సీ స్కూటర్‌ను కూడా భారత మార్కెట్లో విడుదల చేసింది.

Also Read: ట్రయంఫ్ నుంచి కొత్త బైక్.. ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!

Yamaha Aerox 150 cc స్కూటర్ సెగ్మెంట్‌లో విజయవంతంగా నడుస్తుంది. Yamaha AEROX 155  2023 వెర్షన్‌లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) అమర్చబడి ఉంటుంది. ఇది వీల్‌స్పిన్‌ను తగ్గించడం ద్వారా స్కూటర్ రన్నింగ్‌ను మరింత మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలానే ఎలాంటి రైడింగ్ స్థితిలోనైనా మెరుగైన కంట్రోల్ అందిస్తుంది.

Tags

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×