BigTV English

Bigg Boss 9: ఈవారం డబుల్ ఎలిమినేషన్.. ట్విస్ట్ ఏంటంటే?

Bigg Boss 9: ఈవారం డబుల్ ఎలిమినేషన్.. ట్విస్ట్ ఏంటంటే?

Bigg Boss 9:రియాల్టీ షోలలో అన్నిటికంటే ఎక్కువగా ఫేమస్ అయిన రియాల్టీ షో అంటే బిగ్ బాస్ అని చెప్పుకోవచ్చు. ఈ షో నార్త్ లో స్టార్ట్ అయ్యి సౌత్ వరకు వ్యాపించింది. అలా హిందీలో హిట్ అయిన ఈ షో కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు భాషల్లో కూడా వస్తోంది. తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో గురించి చూసుకుంటే.. స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ షో మొదటి నుండి కూడా మంచి ఆదరణ పొందింది. అలా ఇప్పటికే ఎనిమిది సీజన్లను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది. అయితే మొదట రెండు సీజన్లకు ఉన్న టీఆర్పి రేటింగ్ ఇప్పుడు వచ్చే సీజన్ లకి లేకపోయినప్పటికీ సీజన్ 7 మాత్రం భారీ హిట్ అయింది.సీజన్ 7 లో కామనర్ గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో మెప్పించడంతో ఆ షో కి భారీ హైప్ వచ్చింది.ఆ తర్వాత సీజన్ 8 ని ఎవరూ పట్టించుకోకపోయినప్పటికీ సీజన్ 9 మాత్రం కామనర్స్ ఎంట్రీ తో మళ్ళీ టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతోంది.


ఈ వారం డబుల్ ఎలిమినేషన్..

ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9 కి సంబంధించి నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ఐదవ వారం ఎలిమినేషన్ లో ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఆ ఇద్దరు ఎవరు..? డబుల్ ఎలిమినేషన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 లో 5వ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్టు వార్తలు రాగా.. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉండబోతుందట. ఈసారి దమ్ము శ్రీజ, హీరోయిన్ ఫ్లోరా సైనీ ఇద్దరు ఎలిమినేట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే వీరిద్దరూ హౌస్ నుండి బయటికి వచ్చినట్టు సమాచారం.

ALSO READ:BB9 Wild Cards: నేడే హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్.. ఆ 6గురు వీరే!


అసలు ట్విస్ట్ ఇదే..

కానీ ఇందులో ఉన్న మరొక ట్విస్ట్ ఏంటంటే.. నటి ఫ్లోరా సైనీ ని నిజంగానే ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించేస్తారట. కానీ దమ్ము శ్రీజాని మాత్రం ఎలిమినేట్ చేసి మళ్లీ సీక్రెట్ రూమ్ లో ఉంచబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దమ్ము శ్రీజ ముందు నుండి కూడా మంచి పర్ఫామెన్స్ ఇస్తూ పిట్ట కొంచెం కూతఘనం అనేలా పేరు తెచ్చుకుంది.అయితే అలాంటి శ్రీజ ని డబుల్ ఎలిమినేషన్ పేరుతో బయటికి పంపించేసినప్పటికీ సీక్రెట్ రూమ్ లో ఉంచబోతున్నట్టు తెలుస్తోంది.ఇక రీసెంట్గా హీరోయిన్ సంజనా ని కూడా అలాగే ఎలిమినేషన్ పేరుతో బయటికి తీసుకువచ్చి మళ్ళీ లోపలికి పంపించారు.. మరి సంజనా విషయంలో జరిగినట్టే దమ్ము శ్రీజా ని కూడా ఎలిమినేషన్ పేరుతో బయటికి తీసుకొచ్చి సీక్రెట్ రూమ్ లో ఉంచి సడన్గా హౌస్ లోకి మళ్ళీ పంపిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వీరే..

ఇక మరికొంత మందేమో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆరుగురు హౌస్ లోకి వెళ్లడానికి రెడీగా ఉన్నారు.కాబట్టి దమ్ము శ్రీజని ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. మరి ఐదో వారంలో ఇద్దరు ఎలిమినేట్ అవుతారా.. లేక ఒకరు సీక్రెట్ రూమ్ ద్వారా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తారా అనేది తెలియాలంటే కచ్చితంగా మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ వారం వైల్డ్ కార్డు ద్వారా సీరియల్ నటుడు గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్, సీరియల్ నటి అయేషా జీనథ్ లతోపాటు నటుడు శ్రీనివాస సాయి, అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ లో ఒకరైన రమ్య మోక్ష, దివ్వెల మాధురి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం..

Related News

Bigg Boss 9 Promo : సీజన్ 9 లో కొత్త చాప్టర్ మొదలైంది, కన్నీటి కుళాయిలు ఓపెన్, ఆడియన్స్ డెసిషన్ ఏంటి?

BB9 Wild Cards: నేడే హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్.. ఆ 6గురు వీరే!

Bigg Boss 9: అమ్మ బాబోయ్ ఎంతకు తెగించార్రా? మోసం చేసి కెప్టెన్ అయ్యాడు, షాకింగ్ వీడియో

Bigg Boss 9 : భరణి తనూజ బాండింగ్ కు బ్రేక్ పడినట్లేనా? సంచాలక్ గా ఇమ్ము ఫెయిల్? దుమ్ము లేపిన మాస్

Bigg Boss 9 Promo: మైండ్ దొబ్బిందా.. రీతూకి హోస్ట్ స్ట్రాంగ్ కౌంటర్!

Bigg Boss 9 Promo : భరణి గెట్ అవుట్ ఫ్రం హౌస్… హీటెక్కిన వీకెండ్ ఎపిసోడ్

Bigg Boss 9: సుమన్ శెట్టి ఫైర్, కొత్త కెప్టెన్ గా కామనర్, హౌస్ మేట్స్ పై రెచ్చిపోయిన తనూజ

Big Stories

×