Flipkart Nothing Phone 3| ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ ఎంతో అట్టాహాసంగా ప్రారంభమైంది. స్మార్ట్‌ఫోన్‌లు, గాడ్జెట్‌లపై బెస్ట్ డీల్స్ ప్రకటించింది. అయితే ఈ దీపావళి స్పెషల సేల్ లో అతి పెద్ద ఆఫర్ నథింగ్ ఫోన్ 3పై ఉంది. దీని అసలు ధర రూ.79,999 కాగా సేల్ ఈ ప్రీమియం ఫోన్ ఇప్పుడు రూ.39,999కే ఫ్లిప్ కార్ట్ తగ్గింది. అంటే హాఫ్ రేట్ ఆఫర్ అన్న మాట. ఈ డీల్ తో 50 శాతం సేవింగ్స్ చేయొచ్చు.
నథింగ్ ఫోన్ 3 డీల్ గురించి తెలియగానే ఆర్డర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. అయితే ఆ తరువాత అంతా గందరగోళంగా మారింది. ఫోన్ కోసం ఆర్డర్ చేసిన కస్టమర్లు అంతా సంతోషంగా లేరు. దీనికి కారణం చాలామంది ఆర్డర్లు క్యాన్సిల్ అయ్యాయి, డెలివరీలు ఆలస్యమయ్యాయి. ఇటీవలి కాలంలో ఇలా జరగడం ఇది రెండోసారి దసరా సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ లో ఐఫోన్ 16 ఆర్డర్లు కూడా ఇలాగే అర్ధంతరంగా క్యాన్సిల్ అయ్యాయి.
పైగా ఫ్లిప్ కార్ట్ లో ఆ తరువాత సాధారణ ధరకే అవే ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇదంతా చూసి కస్టమర్లు ఇదంతా మోసం అని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహంగా ట్వీట్లు చేశారు.
ఇప్పుడు కూడా అలాగే జరిగింది. సేల్ మొదలైన కొన్ని గంటల్లోనే X (ట్విట్టర్)లో కస్టమర్ల ఫిర్యాదులు బాంబుల్లా పేలాయి. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ బ్యాంక్ ఆఫర్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ తో రూ.26,000కు ఆర్డర్ చేసిన నథింగ్ ఫోన్ 3 స్క్రీన్‌షాట్ పోస్ట్ చేశాడు. ఫ్లిప్‌కార్ట్ సెల్లర్లు “ధర తప్పుగా లిస్ట్ చేయబడింది” అని చెప్పి క్యాన్సిల్ చేశారు. అతను ఫ్లిప్ కార్ట్ కస్టమర్లతో జోక్ చేస్తోందని రాశాడు. స్క్రీన్‌షాట్‌లో రూ.23,956 రీఫండ్, 50 రివార్డ్ కాయిన్‌లు కనిపించాయి. చాలామంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు.
మరికొంతమంది X యూజర్లు తనకు కూడా ఇదే అనుభవం ఎదురైందని పోస్ట్ చేశాడు. ఫ్లిప్‌కార్ట్ లాజిస్టిక్స్ దీపావళి రష్‌కు తగిన విధంగా డెలివరీలు, రిటర్న్ పికప్‌లు చేయడం లేదు. ఒక కస్టమర్ 8 సార్లు పికప్ ఫెయిల్యూర్‌ను పోస్ట్ చేశాడు. అతని ఐటమ్ అక్టోబర్ 3 నుంచి పికప్ షెడ్యూల్ అయింది, కానీ అక్టోబర్ 7 వరకు ఎన్ని సార్లు ట్రై చేసినా వర్కవుట్ కాలేదు. అక్టోబర్ 2కి ఇన్‌స్టాలేషన్ క్యాన్సిల్ అయింది, రోజూ పికప్‌లు జరగలేదు.
ఇంకో యూజర్ తన ఫ్లిప్‌కార్ట్ పనితీరు “వర్స్ట్” అని వర్ణించాడు. ఆర్డర్ దగ్గరి హబ్‌లో ఒక వారం పాటు ఉంది కానీ డెలివరీ కావడం లేదు. ప్రామిస్ చేసిన డేట్‌ను మరో వారం పోస్ట్‌పోన్ చేశారు. ఎలాంటి నోటీస్ కూడా లేదు. “ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇకపై ఆర్డర్ చేయను” అని రాస్తూ.. ఈ స్క్రీన్‌షాట్‌లు, పోస్ట్‌లు పెట్టాడు. ఇప్పుడు నథింగ్ ఫోన్ 3 ఆర్డర్లు డెలివరీ కావడం లేదు.. పైగా చాలా మంది ఆర్డర్లు కారణం తెలుపకుండా క్యాన్సిల్ అవుతున్నాయి.
అయితే కొందరికి మాత్రమే ఫోన్లు డెలివరీ అయ్యాయి. వారంతా ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ద్వారా ఆర్డర్ చేసినవారు. మార్కెట్ ధర కన్నా చాలా తక్కువ ధరకు వాళ్లు జాక్‌పాట్ కొట్టారు. ఈ లక్కీ బైయర్స్ తమ డీవైస్‌లను ఎంజాయ్ చేస్తున్నారు, ప్లాట్‌ఫామ్ బ్యాకెండ్ సమస్యలు ఉన్నా కొన్ని డీల్స్ స్మూత్‌గా వెళ్తున్నాయని చూపిస్తున్నారు.
ఈ సమస్యలపై ఫ్లిప్‌కార్ట్ ఇంకా అధికారిక స్పందించలేదు. కానీ యూజర్లు తమ అనుభవాలు షేర్ చేస్తూనే ఉన్నారు.
Also Read: ఆపిల్ యాప్ స్టోర్‌లో నకిలీ సోరా యాప్స్.. దోపిడికి గురైన లక్షల మంది యూజర్లు