Hyderabad Child Death: చిన్నపిల్లలు ఏది చేసినా ముద్దుముద్దగానే ఉంటుంది. అయితే, ఒక్కోసారి తల్లిదండ్రులు వాళ్లను గమనించకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ లో జరిగింది. ట్యూషన్ కు వెళ్తున్న అన్నయ్యకు టాటా చెప్తూ.. ఓ చిన్నారి మృత్యువాత పడింది. ఈ ఘటన హైదరాబాద్ల ఓని పేట్ బషీరాబాద్ లో జరిగింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
పేట్ బషీరాబాద్ లోని సుభాష్ నగర్ లో మహ్మద్ నిజాం, పర్వీన్ దంపతులు నివాసం ఉంటున్నారు. కూలి పనులు చేస్తూ జీవితం గడుపుతున్నారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు అద్నాన్ స్కూల్ కు వెళ్తున్నాడు. ప్రతి రోజూ స్కూల్ నుంచి రాగానే ప్రెష్ అప్ అయి.. మళ్లీ ట్యూషన్ కు వెళ్తాడు. ఎప్పటి లాగే తాజాగా స్కూల్ నుంచి వచ్చాడు. రెడీ అయ్యి.. ట్యూషన్ కు వెళ్తున్నాడు. అన్నయ్యకు టాటా చెప్తామని ఏడాది వయసున్న చెల్లి సిద్దా అనమ్ రెండో అంతస్తులోని బాల్కనీలోకి వెళ్లింది. అన్నయ్యను చూస్తూ చేతులు ఊపింది. టాటా చెప్తూనే ప్రమాదవశాత్తు బాల్కనీ నుంచి ముందుకు వచ్చింది. క్షణాల్లో పైనుంచి జారి కిందపడింది.
తీవ్ర గాయాలపాలైన చిన్నారి
బిల్డింగ్ మీది నుంచి కింద పడటంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. బాలిక నేరుగా సీసీ రోడ్డు మీద బలంగా పడిపోయింది. తలకు, శరీరానికి బలమైన గాయాలు అయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు చిన్నారిని ముందుగా ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు తమతో కాదని చెప్పడంతో అక్కడి నుంచి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కొద్ది గంటల పాటు చికిత్స తీసుకుంటూ చనిపోయింది. ఈ ఘటనతో సుభాష్ నగర్ లో తీవ్ర విషాదం నెలకొన్నది.
Read Also: హైదరాబాద్‌లో పారిశ్రామికవేత్త దారుణ హత్య, హంతకుడు ఎవడో తెలుసా?
కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు
అటు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పేట్ బషీరాబాద్ సబ్ ఇన్ స్పెక్టర్ శంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చిన్నాఉలను ఎట్టి పరిస్థితులోలనూ ఒంటరిగా వదలకూడదని పోలీసులు తెలిపారు. కచ్చితంగా బాల్కనీలకు గ్రిల్స్ లేదంటే గోడలు ఏర్పాటు చేయాలన్నారు. లేదంటే, పిల్లలు ప్రమాదవశాత్తు కిందపడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
Read Also: ఒక్కడు కాదు.. ఫ్యామిలీ మొత్తం ప్లాన్ చేసి.. గురుమూర్తి కేసులో బయటపడ్డ సంచలన విషయాలు
Read Also: కారులో తిప్పి.. కత్తితో పొడిచి.. తమ్ముడి లవర్‌ని తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి..