కరీంనగర్ జిల్లాలో మమత హత్య మిస్టరీ వీడింది. ఈ హత్యకు మమత వివాహేతర సంబంధమే అని తేల్చారు పోలీసులు. కారులో తిప్పుతూ.. కత్తితో పొడుస్తూ మమతను హత్య చేశాడు నిందితుడు కళ్యాణ్. అనంతరం కారులో ఉన్న మమత కుమారుడైన నాలుగేళ్ల బాలుడిని చెన్నైలో ఉన్నట్లు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు.
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన కలు మల్ల భాస్కర్ సింగరేణిలో ఉద్యోగి. అతడికి కాసిపేట గ్రామానికి చెందిన మేడ మమతతో పరిచయం ఏర్పడింది. మమతకు భర్తతో మనస్పర్థలు రావడంతో అతడిని వదిలి నాలుగేళ్ల కుమారుడు ధృవతో కలిసి మంచిర్యాలలోని తిలక్‌నగర్‌లో ఉంటూ క్యాటరింగ్ పనులు చేసేది. భాస్కర్ జీతం డబ్బంతా మమతకు ఖర్చు చేస్తుండడం.. ఇంట్లో ఇవ్వకపోవడంతో భాస్కర్ కుటుంబ సభ్యులు ఆమెపై కక్ష పెంచుకున్నారు. ఆమెను అంతం చేయాలని భాస్కర్ అక్క అవివాహిత కులుమల్ల నర్మద తన స్నేహితుడు గుంపుల రఘుతో కలిసి పథకం పన్నింది. ఇందుకు నర్మద అక్క భర్త బండ వెంకటేశ్, తండ్రి రాజలింగు సహకరించారని కరీంనగర్ పోలీసుల తెలిపారు.
సుభాష్ నగర్‌కు చెందిన వేల్పుల కళ్యాణ్‌ను సంప్రదించి మమత హత్యకు 5లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో కళ్యాణ్ మమతను ఫోన్ చాటింగ్ ద్వారా ట్రాప్ చేశాడు. జనవరి 25న సెల్ఫ్ డ్రైవింగ్ కారు కిరాయి తీసుకొని మమతను, ఆమె కుమారుడిని మంచిర్యాలలో ఎక్కించుకున్నాడు. తర్వాత మమతను పదునైన కత్తితో పొడిచి, నైలాన్ తాడుతో గొంతు బిగించి హత్య చేశాడు. నర్మద, ఆమె కుటుంబ సభ్యులకు మృతదేహం చూపించి 4 లక్షలు వసూలు చేశాడు. గంగాధర మండలం కురిక్యాల రోడ్డు పక్కన మృతదేహాన్ని పడేసి.. బాబును తీసుకొని హైదరాబాద్ పారిపోయాడు నిందితుడు కల్యాణ్.
Also Read: కీచక కానిస్టేబుల్.. న్యాయం కోసం వస్తే.. కడుపు చేసి భార్యతో కలిసి ఆమెను
మమత కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలిసులు..కళ్యాణ్ అద్దెకి తీసుకున్న కారు.. అతని సెల్ ఫోన్ సిగ్నల్ అధారంగా కేసు దర్యాప్తులో వేగం పెంచారు. సీసీ కెమెరాలో కారు నంబర్ సహాయంతో..నిందితుడు కళ్యాణ్ అని గుర్తు పట్టారు. కళ్యాణ్ ధృవని తీసుకొని చెన్నై వెళ్ళాడని పసిగట్టిన పోలిసులు..అక్కడి పోలీసుల సహకారంతో బాలుడు ధృవని రక్షించారు.