Food Poison: తిరుపతి శ్రీకాళహస్తిలోని BC బాలుర హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఉదయం టిఫెన్ తిన్న తర్వాత 15 మంది విద్యార్థులు కడుపు నొప్పికి గురయ్యారు. అయితే మరికొన్ని నివేదికల ప్రకారం, బాధితుల సంఖ్య 30 కి పైగా ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే పిల్లలందరినీ శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఫుడ్ పాయిజన్‌కు వార్డెన్ నిర్లక్ష్యమే కారణమంటున్నారు పిల్లలు.
Also Read: ఒంటరైన ఇరాన్.. హ్యాండ్ ఇచ్చిన మిత్ర దేశాలు..
మూడు రోజుల కిందటి పిండితో చేసిన ఇడ్లీలను తినడం వల్లే కడుపు నొప్పి వచ్చిందంటున్నారు. టిఫెన్ చేసే సమయంలో కూడా ఇడ్లీ సరిపోలేదని చెప్పినందుకు వార్డెన్ దాడికి ప్రయత్నించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కూటమి నాయకులు ఆస్పత్రి చేరుకొని పిల్లలని ఆరా తీసారు. వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలియడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.