BigTV English
Advertisement

SKN: పవన్ కళ్యాణ్ తల్లికి అస్వస్థత.. అలా పోస్ట్ పెట్టి డిలీట్ చేసిన నిర్మాత.. అందులో ఏముందంటే ?

SKN: పవన్ కళ్యాణ్ తల్లికి అస్వస్థత..  అలా పోస్ట్ పెట్టి డిలీట్ చేసిన నిర్మాత.. అందులో ఏముందంటే ?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యం పాలయ్యినట్లు తెలుస్తోంది. వయో వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఇక తల్లి అనారోగ్యం గురించి తెలియడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కేబినెట్ సమావేశం మధ్యలోనే వదిలేసి హుటాహుటిన హాస్పిటల్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది. కొణిదెల అంజనాదేవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరం లేదు.


 

కొణిదెల వెంకట్రావు- కొణిదెల అంజనా దేవికి ముగ్గురు కొడుకులు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్. ముగ్గురు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్నారు. నిత్యం కొడుకుల ఎదుగుదలను కోరుకొనే అంజనమ్మ.. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎంతో ఆనందపడింది. తన కొడుకు అనుకున్నది సాధించాడని కంటనీరు పెట్టుకుంది. ఇక తనకు అందరికన్నా పవన్ కళ్యాణ్ అంటేనే ఇష్టమని.. ఫుడ్ మొత్తం అతనికే దాచిపెడుతుందని నాగబాబు, చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంతలా ఆమె ముగ్గురు కొడుకులతో సంతోషంగా ఉంది. ఈమధ్యనే చిరు.. తల్లి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాడు.


 

ఇక ప్రస్తుతం అంజనమ్మ ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. ఇప్పటికీ మెగా కుటుంబం అంతా హాస్పిటల్ వద్దనే ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ సైతం.. మీటింగ్స్ పక్కన పెట్టేసి వచ్చినట్లు సమాచారం. అంజనమ్మ అనారోగ్యం గురించి తెలుసుకున్న నిర్మాత SKN.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.  ఆ పోస్టులో గెట్ వెల్ సూన్  అంజనమ్మ అని పెట్టడంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. నార్మల్ చెకప్ కోసమో.. లేక చిన్న ఫీవర్ లాంటిది అయితే ఈ రేంజ్ లో పోస్ట్ పెట్టరు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతోనే నిర్మాత ఈ రేంజ్ లో పోస్ట్ పెట్టి ఉంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ,  పెట్టిన కొద్దిసేపటికే SKN ఆ పోస్ట్ ను డిలీట్ చేశాడు. SKN  మెగా ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు అన్న విషయం తెల్సిందే. మెగా ఫ్యామిలిలో చీమ చిటుక్కు మన్నా SKN కి తెలుస్తుంది. ఆయనే ఈ పోస్ట్ పెట్టడంతో అంజనమ్మ కండీషన్ సీరియస్ అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

 

మరి ఈరోజే అంజనమ్మను హాస్పిటల్ లో చేర్చారా.. ? ముందు నుంచే ఆమె హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుందా.. ? అనేది తెలియాల్సి ఉంది. పవన్ హుటాహుటిన హాస్పిటల్ కు వెళ్లడంతో సీరియస్ విషయమే అని అర్ధమవుతుంది. కొద్దిసేపటి క్రితమే ఉపాసన.. అంజనమ్మ, సురేఖతో కలిసి ఆవకాయ పడుతున్న వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో అంజనమ్మ.. ఉపాసన, చరణ్, సురేఖతో బాగానే మాట్లాడుతూ కనిపిస్తుంది.  ఈలోపే ఆమె అనారోగ్యానికి గురైంది అంటే షాకింగ్ గా ఉందని చెప్పుకొస్తున్నారు. ముగ్గురు చిరంజీవులను కన్న ఆ తల్లి ఇంకా ఆరోగ్యంగా బతకాలని, ఆమె త్వరగా కోలుకోవాలని నెటిజన్స్  ప్రార్థన చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Related News

Janhvi Kapoor : ఇది నా అదృష్టం, జాన్వి పాపా పెద్ది కన్సర్ట్ లో ఎంత ముద్దుగా మాట్లాడిందో

Ram Charan: నా కల నిజం అయిపోయింది, కన్సర్ట్ లో రామ్ చరణ్ అదిరిపోయే ఎంట్రీ

SSMB29 : మొత్తానికి మహేష్ బాబు అప్‌డేట్ ఇచ్చాడు, గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ పై మహేష్ రియాక్షన్.

Gouri G Kishan : నాకు మారి సెల్వరాజ్ సార్ ఫోన్ చేశారు, ఇష్యూ గురించి ఏం చెప్పారంటే?

The Great Pre wedding show: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాపై బెల్లంకొండ రియాక్షన్, మొదటి సెలబ్రిటీ సపోర్ట్

Shraddha Das: అల్లు అర్జున్ టాలీవుడ్ షారుక్.. నా ప్రపంచమే మారిపోయిందన్న నటి!

Actor Vikranth: అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ..700 మంది ఎంప్లాయిస్.. ఈ హీరో బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదే!

Ajay Bhupathi : ఘట్టమనేని వారసుడు సినిమా టైటిల్ ఇదే, ఆ సెంటిమెంట్ వదలని అజయ్ భూపతి

Big Stories

×