Constable suicide: సంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ సందీప్ (30) తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై, అందులో భారీగా డబ్బులు పోగొట్టుకున్న కానిస్టేబుల్ తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడిని నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్‌కు చెందిన సందీప్‌గా గుర్తించారు. ఆయన గత ఏడాదిగా సంగారెడ్డి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇవాళ సందీప్ మహబూబ్‌సాగర్ చెరువుకట్టపైకి వెళ్లి, తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కానిస్టేబుల్ సందీప్ ఆన్‌లైన్ గేమ్స్‌కు అడిక్ట్ అయ్యి.. వాటిలో పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోవడంతోనే తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా ఏర్పడిన అప్పులే ఆత్మహత్యకు దారితీసి ఉండవచ్చని భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే సంగారెడ్డి పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, సంఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు.
ALSO READ: Jubilee by-election: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఏ పార్టీపై ఎఫెక్ట్ పడనుంది..?
కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటనపై జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలపై విచారణ చేపడతామని ఎస్పీ తెలిపారు. ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనం ఈ దారుణానికి దారితీసిందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉండి కూడా కేవలం ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా ఒక యువ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా.. పోలీస్ వర్గాల్లో విషాదం నింపింది. ఈ సంఘటన ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ వ్యసనాల ప్రమాదకర పరిణామాలను గురించి తెలియజేస్తోంది.
ALSO READ: EPFO Enrollment Scheme: ఈపీఎఫ్ఓ ఉద్యోగుల ఎన్ రోల్మెంట్ స్కీమ్.. మీరు అర్హులేనా?