Bus Accident: ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లింగపాలెం మండలంలోని జూబ్లీనగర్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఒక ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందగా, పది మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఈ ఘోర ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే.. స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం, అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బస్సు బోల్తా పడటానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: Jagityala News: రూ.50 లేక తల్లిని భుజాన మోసిన కుమారుడు.. కన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనం
అయితే.. బస్సు అతి వేగం లేదా డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Jubilee Hills Bypoll:జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారాల్లో కనిపించని ఆ ఇద్దరు కీలక నేతలు..?