Bus Accident: మరో రోడ్డు ప్రమాదం.. టైమ్ మారుతుంది.. డేట్ మారుతోంది.. ప్లేస్ మారుతోంది.. కానీ ప్రమాదాలు ఆగడం లేదు.. ప్రాణాలు పోవడం ఆగడం లేదు. నిన్న చెవేళ్ల ప్రమాదం.. నేడు మధ్యప్రదేశ్.. ఇలా రోజు ఏదో ఒక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మధ్యప్రదేశ్‌లో మరో బస్సు ప్రమాదం జరిగింది.
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. సిమ్రోల్ ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, దాదాపు 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొండ ప్రాంతం భేరు ఘాట్ సమీపంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఓంకారేశ్వర్ నుండి ఇండోర్‌కు వెళ్తున్న బస్సు.. కొండ ఎక్కుతుండగా నియంత్రణ కోల్పోయి లోయలో పడిపోయింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని పోలీసులు తెలిపారు. దీని పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: అనిల్ అంబానికి బిగ్ షాక్.. రూ.3,084 కోట్ల విలువైన 40కిపైగా ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ, సీబీఐ