Hyderabad: హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. స్విమ్మింగ్ ఫుల్‌కి ఈతకు అని వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్ ప్రాంతంలోని అమీన్ పూర్ లోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో సోమవారం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఘటన వెనుక ఉన్న కారణాలు వివరంగా పరిశీలిస్తున్నారు. మరో వైపు చిన్నారులు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ప్రాంతంలోని సంగారెడ్డి జిల్లా, అమీన్‌పూర్ మండలంలోని హెచ్‌ఎంటీ స్వర్ణపూరి కాలనీలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్బన్ రైజ్ స్ర్పింగ్ ఈజ్ ఇన్ ది ఎయిర్ అపార్ట్ మెంట్‌లో నివాసముంటున్న షణ్ముఖ కుమార్ ప్రజ్ఞ(9), విజయ్ రెడ్డి, అద్విక రెడ్డి(8)లు ఆదివారం సాయంత్రం అదే కమ్మూనిటీలో ఉన్న స్విమ్మింగ్ ఫూల్‌లో ఈత కొట్టడానికి వెళ్లారు. స్విమ్మింగ్ చేస్తూ నీటిలో మునిగిపోయారు.
Also Read: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు.
అపార్ట్ మెంట్ పైన నుంచి గమనించిన స్థానికులు వెంటనే అక్కడి ప్రాంతానికి వచ్చి పరిశీలించగా ఇద్దరు బాలికలు కొన ఊపిరితో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ప్రజ్ఞను మియాపూర్ లోటస్ హాస్పిటల్‌కు, అద్విక రెడ్డిని కొండాపూర్ లోని హోలిస్టిక్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ప్రజ్ఞ ఆదివారం రాత్రి 11 గంటలకు మరణించింది. అద్విక రెడ్డి సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ప్రాణాలు వదిలింది. ఇద్దరు చిన్నారులను పోస్ట్ మార్టం చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. ముక్కపచ్చలారని ఇద్దరు చిన్నారులు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.