BigTV English

Rowdy Constable: రక్షకుడే భక్షకుడై.. సామాన్యుడి కన్ను పగల గొట్టిన కానిస్టేబుల్..

Rowdy Constable: రక్షకుడే భక్షకుడై.. సామాన్యుడి కన్ను పగల గొట్టిన కానిస్టేబుల్..

Rowdy Constable (telugu breaking news today):


చింతల్‌‌లో సామాన్యుడిపై పోలీస్ కానిస్టేబుల్ రౌడీయిజం ప్రదర్శించాడు. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్ రోడ్డు‌పై రౌడీ అవతారం ఎత్తాడు. తాను ప్రభుత్వ ఉద్యోగిని అని మరిచి ఓ కటింగ్ షాప్ నిర్వాహకుడి‌పై చేయి చేసుకొని ఇష్టం వచ్చినట్లు ముష్టి గుద్దులు గుద్ది కన్ను‌పై రక్తం వచ్చేలా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు.

రోడ్డు‌పై GHMC వారు డ్రైనేజీ లైన్ వేస్తుంటే మట్టి ఉంది పక్కన నుండి వెళ్ళు అని కటింగ్ షాప్ నిర్వాహకుడు సివిల్ డ్రెస్‌లో ఉన్న శ్రీనివాస్ గౌడ్‌కు సూచించాడు. దీనికి కోపంతో శ్రీనివాస్ గౌడ్ నువ్వేంటి నాకు చెప్పేది అంటూ చేయి చేసుకున్నాడు. ఈ గొడవలో పరస్పరం వాగ్వివాదానికి దిగారు. గొడవ‌పై రెచ్చిపోయిన కానిస్టేబుల్ తన దేహ ధారుడ్యాన్ని కటింగ్ షాప్ నిర్వాహకుడి‌పై ప్రదర్శించాడు. రక్తం వచ్చేలా కొట్టి “నేను పోలీస్ కానిస్టేబుల్ ఏమి చేసుకుంటావో చేసుకో” అంటూ వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై బాధితుడు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.


సీఐ (Ci) బాధితుడి‌తో మాట్లాడి అనుకోకుండా జరిగిందని.. చూసుకో అంటూ ఉచితంగా ఓ సలహా ఇచ్చారని బాధితుడు తెలిపాడు. ఇది ఇలా ఉండగా.. స్టేషన్లో బాధితుడికి బాసటగా ఉండాల్సిన సిబ్బంది తమ ఖాకీకి వత్తాసు పలికారు. బాధితుడిని పిలిచి “నువ్వు ఎంత చేసినా.. కేసు పెట్టినా.. అతనికి జరిగే నష్టం ఏమీ ఉండదు. గమ్మున కంప్రమైస్ అవ్వు లేదా మళ్ళీ పెట్రోల్ మొబైల్ డ్యూటీ‌లో వచ్చినపుడు నిన్ను దృష్టిలో ఉంచుకుంటాం..” అని బెదిరించారని బాధితుడు వాపోయాడు.

Tags

Related News

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Kerala Crime: గదిలో లాక్ చేసి.. మతం మారాలంటూ ప్రియురాలిని వేధించిన ప్రియుడు.. ప్రాణాలు విడిచిన యువతి

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Kukatpally News: ఎంత పని చేశావ్ దేవుడా..? షటిల్ ఆడుతుండగా కరెంట్ షాక్.. క్షణాల్లో బాలుడు మృతి

Big Stories

×