Karnataka Crime: మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. అగ్నిసాక్షిగా కట్టిన తాళిని ఎగతాళి చేస్తున్నారు. దాని ఫలితమే ఆత్మహత్యలు, హత్యలు. తాజాగా కర్ణాటకలో ఊహించని ఘటన జరిగింది. పెళ్లయి 11 ఏళ్ల ఓ వివాహిత ఇద్దరితో రిలేషన్ షిప్ మొదలుపెట్టింది. తమకు అడ్డుగా ఉన్నారని భావించి భర్త ఫ్యామిలీని చంపేందుకు స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయింది.
కనిపిస్తున్న మహిళ పేరు చైత్ర. వయస్సు 33 ఏళ్లు. హాసన్ జిల్లా బేలూరు తాలూకా కెరళూరు గ్రామానికి గజేంద్రతో 11 ఏళ్ల కింద చైత్రకు పెళ్లయ్యింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అత్తమామల తో కలిసి హాయిగా జీవిస్తున్న సంసారంలో ఒక్కసారిగా కలతలు మొదలయ్యాయి. దీంతో భార్యభర్తల మధ్య విభేదాలు పొడచూపాయి.
చివరకు తారాస్థాయికి చేరుకున్నాయి. గడిచిన మూడేళ్లుగా పునీత్ అనే యువకుడితో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టింది చైత్ర. భార్య విషయం తెలుసుకున్న గజేంద్ర, చైత్ర తల్లిదండ్రులకు సమాచారం అందజేశాడు. చివరకు రెండు కుటుంబాలు జోక్యం చేసుకుని భార్యభర్తల మధ్య సమస్యను పరిష్కరించారు.
ఇంతవరకు బాగానే జరిగింది. ఏడాదిగా చైత్రం కెరళూరు గ్రామానికి చెందిన శివుతో సంబంధం పెట్టుకుంది. తన విషయం భర్త, అత్తమామలకు తెలిసి ఉంటుందని భయపడింది. మళ్లీ ఈ విషయం బయటపడితే మరిన్ని కష్టాలు తప్పవని భావించింది. చివరకు పిల్లలు, భర్త, అత్తమామలను చంపేందుకు ఊహించని విధంగా స్కెచ్ వేసింది.
ALSO READ: భార్యను దారుణంగా నరికి, తలతో పోలీసుస్టేషన్ కు వచ్చిన భర్త
ఈ విషయంలో ప్రియుడి నుంచి సపోర్టు వచ్చింది. ప్రతిరోజూ భోజనంలో రకరకాల మాత్రలు కలిపి పెట్టేది. అయితే చైత్ర భర్త గజేంద్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులు ఫుడ్ పాయిజనింగ్ అయినట్టు గుర్తించారు. ఆ తర్వాత భార్యను అనుమానించిన గజేంద్ర, ఇంటిని తనిఖీ చేశాడు. చైత్ర క్రూరమైన ఉద్దేశాలు బయటపడ్డాయి.
ఏ మాత్రం ఆలోచించకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో ఊహించని నిజాలు బయటపెట్టింది చైత్ర. భర్త, పిల్లలు, అత్తమామలను చంపే ఉద్దేశ్యంతో ప్రతిరోజూ వారికి వడ్డించే ఆహారంలో విషం కలిపినట్టు అంగీకరించింది. చివరకు చైత్రను అరెస్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఆమె ప్రియుడు శివ పరారీలో ఉన్నాడు.
వాడి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. తన సుఖం కోసం తాళి కట్టిన భర్త, పిల్లలు, అత్తమామలను చంపాలని భావించి అడ్డంగా బుక్కయ్యింది చైత్ర. దేవుడు అనేవాడు ఉంటాడని చెప్పడానికి చైత్ర కథ ఒక ఉదాహరణ.