Crime News: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఆనేకల్ ప్రాంతంలో జరిగిన ఒక దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. శంకర్ (28), మానస (26) ఇద్దరూ భార్యభర్తలు. అయితే శంకర్, తన భార్య మానస (26) వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో దారుణంగా ఆమె తలను నరికి.. సూర్యనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి హీలలిగే గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. శంకర్, మానస దంపతులు కొంతకాలం నుంచి హీలలిగే గ్రామంలో ఓ ఇంట్లో రెంట్‌కు ఉంటున్నారు. జూన్ 3న శంకర్ పని నిమిత్తం బయటకు వెళ్తానని చెప్పి.. అనుకోకుండా అదే రోజు రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో మానస మరో వ్యక్తితో ఉన్నట్లు శంకర్ ఆరోపిస్తున్నాడు. దీంతో శంకర్ ఆమెపై తీవ్ర అనుమానాన్ని పెంచుకున్నాడు. గత వారం నుంచి ఈ అనుమానంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఇదే వివాదంపై మళ్లీ ఇద్దరు గొడవకు దిగారు.
ALSO READ: Life After Death : 24 నిమిషాల పాటు చనిపోయిన మహిళ.. ఆ సమయంలో ఆమె ఏం చూసిందంటే..
కోపంతో రెచ్చిపోయిన శంకర్ సమీపంలోని దుకాణం నుంచి కత్తిని కొని.. మానసపై కిరాతకంగా దాడి చేశాడు. ఆమె తలను నరికాడు. అనంతరం, ఆమె తలను స్కూటర్‌పై తీసుకుని సూర్యనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు వెంటనే శంకర్‌ను అదుపులోకి తీసుకుని, ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో ఈ హత్య ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు పోలీసులు నిర్దారించారు.
ALSO READ: Breaking News: గోదావరిలో ఆరుగురు యువకులు గల్లంతు..
ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. వివాహేతర సంబంధాలపై అనుమానాలు.. ఇలాంటి దారుణాలకు దారితీయడం సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి, శంకర్‌పై హత్య నేరం కింద చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.