E-Paper
Advertisement

Guntur Crime: ప్రియుడిపై కోపం.. ఇంటికి నిప్పంటించిన ప్రియురాలు, గుంటూరు జిల్లాలో దారుణం

Guntur Crime: ప్రియుడిపై కోపం.. ఇంటికి నిప్పంటించిన ప్రియురాలు, గుంటూరు జిల్లాలో దారుణం
Advertisement

Guntur Crime: వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబంలో చిచ్చుపెడుతున్నాయి. ప్రియుడిపై కోపంతో అతడి కటుంబసభ్యులను చంపేందుకు ప్లాన్ చేసింది. చివరకు ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టింది ప్రియురాలు. దారుణమైన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. అసలు ఎలా జరిగింది? దీని వెనుక అసలు కారణాలేంటి? ఒక్కసారి లోపలికి వెళ్తే..

గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన

Advertisement

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని సుద్దపల్లి గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సుద్దపల్లికి చెందిన మల్లేష్‌కు తెనాలికి చెందిన దుర్గతో కొంతకాలం కిందట పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరు మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది.

మల్లేష్‌తో పరిచయం ఏర్పడక ముందే దుర్గకు వివాహం జరిగింది. ఓ కొడుకు కూడా ఉన్నాడు. కొద్దిరోజులుగా మల్లేష్-దుర్గ మధ్య మాటా మాటా మొదలై గొడవలకు దారి తీసింది. ఈ క్రమంలో పంచాయతీలు కూడా జరిగాయి. మరొకసారి వీరిద్దరి గొడవపై శనివారం తెనాలిలో పంచాయితీ మొదలైంది. తనను పంచాయితీకి లాగడంపై రగిలిపోయింది.

Advertisement

ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టిన ప్రియురాలు

చివరకు ప్రియుడిపై కోపం పెంచుకుంది దుర్గ. శనివారం సాయంత్రం సుద్దపల్లికి చేరుకున్న ఆమె, మల్లేష్‌ భార్యతో వివాదానికి దిగారు. ఈ క్రమంలో మల్లేష్ ఇంటికిపై పెట్రోలు వేసింది. మల్లేష్ భార్య, కొడుకు, మల్లేష్‌ తల్లిపై పోసి నిప్పు పెట్టింది. ఈ క్రమంలో తెనాలిలో ఉన్న మల్లేష్‌కు ఫోన్‌ చేసి బెదిరిస్తూ ఇంటికి నిప్పు పెట్టినట్టు చెప్పింది.

పెట్రోల్ పోసే క్రమంలో దుర్గపై పెట్రోలు పడింది. చివరకు ఆమెకి నిప్పు అంటుకుంది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఇరుగుపొరుగువారు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. సాయపడిన ఆరుగురు స్థానికులకు గాయాలు అయ్యాయి.

ALSO READ: అపార్ట్‌మెంట్‌లో పేలిన ఏసీ.. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు

వెంటనే బాధితులను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దుర్గతోపాటు తీవ్రంగా గాయపడినవారిని వడ్లమూడిలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేశారు. ఇరువైపుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

 

 

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×