E-Paper
Advertisement

Accident in AP: ఏలూరులో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Accident in AP: ఏలూరులో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
Advertisement
Accident in ELURU Three members died: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరులో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు.
రెప్పపాటులో మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల సమీపంలోని శ్రీలక్ష్మీనగర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ తోపాటు ఇద్దరు మృతి చెందారు. గాయపడిన బాలుడికి చికిత్స అందిస్తున్నారు. వీరంతా విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు వెలికితీశారు. అనంతరం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×