E-Paper
Advertisement

MLA Son Arrest Drugs Case: డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు అరెస్ట్

MLA Son Arrest Drugs Case: డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు అరెస్ట్
Advertisement

MLA Son Arrest Drugs Case: ఏపీలోని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యారు. నార్సింగ్‌లో కొందరు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్టు అందించిన సమాచారంతో ఈగల్‌ టీమ్‌, నార్సింగి పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ చేశారు. ఈ తనిఖీల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డిగా తెలిసింది. సుధీర్ రెడ్డితో పాటు మరొకరికి డ్రగ్స్‌ పరీక్ష చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో సుధీర్‌రెడ్డిని అరెస్టు చేసి డీ అడిక్షన్‌ సెంటర్‌కు తరలించినట్టు తెలుస్తోంది.

డిప్రెషన్ లో సుధీర్ రెడ్డి

“ఎమ్మెల్యే ఆదినారాయణ కుమారుడు సుధీర్ రెడ్డికి గంజాయి పాజిటివ్ వచ్చింది. సుధీర్ రెడ్డి గత కొంత కాలంగా డిప్రెషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈగల్ టీమ్ కి వచ్చిన ఫోన్ కాల్ తో సుధీర్ రెడ్డి ఇంట్లో సోదాలు చేశాం. సుధీర్ రెడ్డి తో పాటు ఇంట్లో ఉన్న మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. అయితే సుధీర్ రెడ్డికి మాత్రమే గంజాయి పాజిటివ్ వచ్చింది. మిగిలిన ఇద్దరికి నెగిటివ్ వచ్చింది. సుధీర్ రెడ్డిని డీ ఆడిక్షన్ సెంటర్ కి తరలించాం. సోదాల సమయంలో డ్రగ్స్, గంజాయి దొరకాలేదు. డిప్రెషన్ కారణంగానే సుధీర్ రెడ్డి డ్రగ్స్ కు అలవాటు పడినట్లు సమాచారం. సుధీర్ రెడ్డి పట్టుబడిన వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం” –ఈగల్ టీమ్

Advertisement

Also Read: న్యూ ఇయర్ వేడుకలపై సీపీ సజ్జనార్ ఆంక్షలు, విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టివేత

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×