AP Crime: ఏపీలో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి కన్న కూతురిపై అఘాయిత్యం చేశాడు. ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని ఓ గ్రామానికి చెందిన కసాయి తండ్రి మద్యం మత్తులో 12 ఏళ్ల తన రెండో కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండడంతో తల్లి ఒంగోలులోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు బాలికను పరీక్షించి, అఘాయిత్యం జరిగిందని నిర్ధారించారు. దీంతో బాలికను ఇంటికి తీసుకొచ్చిన తల్లి.. బాలికను ఆరా తీసింది. దీంతో బాలిక అసలు విషయం చెప్పింది. వెంటనే తల్లి కొండపి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తు్న్నామని పోలీసులు తెలిపారు.
తల్లిదండ్రుల పరిస్థితిని ఆసరాగా తీసుకుని 14 ఏళ్ల బాలికపై ఓ ఆటో డ్రైవర్ ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ దారుణం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. రణస్థలం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుటుంబ పరిస్థితుల కారణంగా స్థానికంగా ఉన్న పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడు నిద్రపోవాలంటే ఓ మాత్ర వేసుకోవాలి.
అతడి కుమార్తె పక్క ఊరిలోని పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. ఇతర విద్యార్థులతో కలిసి రోజూ ఆటోలో పాఠశాలకు వెళ్లి వస్తుంది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ పిన్నింటి రామారావు బాలికపై కన్నేశాడు. బాలిక తల్లితో పరిచయం చేసుకుని ఆమెకు మద్యం అలవాటు చేశాడు. తండ్రి మత్తు బిల్ల వేసుకుని నిద్రపోయేవాడు. తల్లిదండ్రులిద్దరూ మత్తులో ఉండగా బాలికపై రామారావు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాదిగా అతడు బాలికపై లైంగిక దాడి చేస్తున్నాడు.
Also Read: Husband Suicide: ఇంట్లో అత్త ఉండొద్దని భార్య గొడవ.. 15 వ అంతస్తు నుంచి దూకి భర్త ఆత్మహత్య
ఆటో డ్రైవర్ తీరుపై అనుమానంతో ఒక రోజు తండ్రి మాత్ర వేసుకోలేదు. కుమార్తెపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి యత్నించగా తండ్రి అడ్డుకున్నాడు. దీంతో బాలిక అసలు విషయం తండ్రికి చెప్పింది. బాలిక తండ్రి జేఆర్‌పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యానికి బానిసై బాలిక తల్లి ఆటోడ్రైవర్‌కు మద్దతు తెలిపినట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదుతో తల్లి, ఆటోడ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు.