Pa Ranjith: సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే అని కొంతమంది దర్శకులు భావిస్తే, అతి తక్కువ మంది దర్శకులు మాత్రం సినిమా అనేది ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫారం ఏ విషయాన్ని అయినా అక్కడ చెబితే చాలామందికి రీచ్ అవుతుంది అని నమ్ముతారు. ఒక మనిషిని కదిలించగలిగే శక్తి సినిమాకి ఉంటుంది. ఒక మనిషి ఆలోచనలలో మార్పు తీసుకొచ్చే శక్తి సినిమాకి ఉంటుంది. ఒక మనిషిని మార్చగలిగే శక్తి సినిమాకి ఉంటుంది.
చాలామంది దర్శకులు కొన్ని కథలను చెబుతారు. ఆ కథలు కొన్ని వాస్తవిక సంఘటనలను చూసి కావచ్చు, కొన్ని ఊహల్లో నుంచి పుట్టినివి కావచ్చు. కానీ అతి తక్కువ మంది దర్శకులు మాత్రమే బడుగు బలహీన వర్గాల జీవితాన్ని, వాళ్ల కన్నీళ్ళని, వాళ్ల ఆక్రందనను, వాళ్ల అనగారినితనాన్ని, అంటరానితనం వలన వాళ్ళు ఎదుర్కొన్న బాధలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నాన్ని చేస్తుంటారు. అటువంటి దర్శకులలో ప్రస్తుత కాలంలో అందరికీ టక్కున గుర్తుచే పేరు పా రంజిత్, వెట్రి మారన్, మారి సెల్వ రాజ్.
మారి సెల్వ రాజ్ దర్శకత్వంలో ధ్రువ విక్రమ్ నటించిన బైసన్ సినిమా దీపావళి కానుకగా విడుదలైంది ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఈ సక్సెస్ మీట్ లో రంజిత్ మాట్లాడుతూ..
కాంతారా సినిమా హిట్ అయినప్పుడు చాలామంది తమిళ్ అభిమానులు ముగ్గురు డైరెక్టర్స్ తమిళ సినిమాని స్పాయిల్ చేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు. 600 సినిమాలు గత రెండేళ్లలో విడుదలయ్యాయి. ఆ డైరెక్టర్ ఎవరు కూడా తమిళ్ సినిమా గ్రోత్ కి ట్రై చేయలేదా అంటూ క్వశ్చన్ చేశారు.
అయితే ప్రస్తుతం పా రంజిత్ మాట్లాడిన మాటలకు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు లభిస్తున్నాయి. కొందరు దర్శకులు తమకంటూ ఒక మంచి పేరు సాధించుకోవాలి. జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అని సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. సమాజంలో ఒక సరైన మార్పులు తీసుకురావాలి. కుల రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలి అని ఆలోచనతో దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు.
అలా ఆలోచించే దర్శకులలో ఒకరు పా రంజిత్, వెట్రి, మారి సెల్వ రాజ్. ఇప్పటివరకు రంజిత్ చేసిన సినిమాలన్నీ కూడా సమాజాన్ని ప్రశ్నించేలా ఉంటాయి. కొన్ని విషయాలను ఎత్తి చూపించేలా ఉంటాయి. సినిమా అంటే ఒక గొప్ప విషయాన్ని చెప్పడానికి ఉన్న ఒక ఆయుధం. అందుకనే స్టార్ హీరోలతో సైతం సమాజానికి ఉపయోగపడే సినిమాలను తీసే ప్రయత్నం చేస్తుంటారు ఈ దర్శకులు.
Also Read: Yellamma: అనుకున్నదే అయింది, ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా పక్కన పెట్టేసిన ఎల్లమ్మ యూనిట్