BigTV English
Advertisement

Tirumala parakamani: మిస్టరీగా మారిన పరకామణి కేసు

Tirumala parakamani: మిస్టరీగా మారిన పరకామణి కేసు

Tirumala, parakamani : పరకామణి కేసును గత పాలకులు, అధికారులకు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా?..చూస్తున్న పరిణామాలు చూస్తేంటే అదే నిజమెమో అనిపిస్తుందంటున్నారు .. ఓ వైపు టీటీడీ పాలక మండలి అనుమతి లేకుండా ఎవీఎస్ స్థాయి అధికారి కేసులోరాజీ పడ్డారంటూ.. ఈవో హైకోర్టులో అఫిడవిట్ చేస్తే ఫిర్యాదుచేసిన తనకు రాజీ అయ్యే హక్కు ఉందంటూ ఎవీఎస్ ఓ కౌంటర్ దాఖలు చేయడం గమనార్హం . ఆ క్రమంలో మొత్తం మీద పరకామణి కేసులో అసలేం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది.


రవికుమార్ పై సతీష్ కుమార్ ఫిర్యాదు:

2023 ఏప్రిల్ నెలలో పరకామణి లో డాలర్స్ తీసుకుపోతూ పెద్ద జియ్యర్ గుమస్తా రవికూమార్ పట్టుబడ్డాడు..అతనిపై తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎవిఎస్ ఓ సతీష్ కూమార్ ఫిర్యాదు చేసారు. తర్వాత సెప్టెంబర్ లో లోక్ అదాలత్‌లో రవికూమార్‌తో రాజీ అయ్యినట్లు ప్రకటించి కేసు లేకుండా చేశారు.అయితే నాలుగు నెలల పాటు అసలేం జరిగింది..నాలుగు నెలల కాలంలో జరిగిన పరిణామాలు ఏమిటి అన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది..

పెద్ద జియ్యాంగార్ గుమస్తాగా ఉంటూ పరకామణి లెక్కింపు:

నాలుగు నెలల కాలంలో రవికూమార్ పై టిటిడి విజిలెన్స్ విచారణ జరిపింది. అతను పెద్ద ఎత్తున తిరుపతితో పాటు తమిళనాడు, కర్నాటక, తెలంగాణలలో అస్తులు సంపాదించాడని సుమారు 25 సంవత్సరాల పాటు జియ్యంగార్ గుమస్తాగా ఉంటు నిత్యం మఠం తరుపున పరకామణి లెక్కింపులో పర్యవేక్షకుడిగా పాల్లొన్నారని దొంగతనం అతని నిత్యకృత్యమని వచ్చిన రిపోర్టు ప్రకారం పాలక మండలి పెద్దలతో పాటు అప్పటి ఉన్నతాధికారులు పావులు కదిపారు. ఇందులో బాగంగా ఓ అత్యవసరం పాలకమండలి సమావేశం ఏర్పాటు చేసి రవి కూమార్ అస్తులను పాక్షికంగా టిటిడి కి రాయించారు..ఇందులో సైతం దేవాదాయ శాఖ నిబంధనలను తుంగలో తొక్కారు.


రవికుమార్‌తో రాజీ అయిన సతీష్:

తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో పరకామణి మీద జరిగిన పరిణామల నేపథ్యంలో హైకోర్టుకు జర్నలిస్టు శ్రీనివాసులు వెళ్ళడం హైకోర్టు పోలీస్, టిటిడి మీదా సీరియస్ అయిన నేపథ్యంలో సిఐడి మొత్తం విషయాలను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు ఇవ్వగా మరో వైపు టిటిడి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది..ఇందులో కేసు పెట్టిన ఎవిఎస్‌ఓ సతీష్ టిటిడి బోర్డుకు విషయం తెలపకుండా రాజీ అయ్యాడని అంటుంది. అయితే అప్పటికే దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న రవికూమార్, అయన భార్య రమ్య పేరు మీదున్న అస్తులను టిటిడి ఎందుకు రాయించుకుంది?..అందుకోసం టీటీడీ బోర్టు ఎందుకు తీర్మానం చేసింది అనేది చర్చనీయాంశంగా మారింది.
అప్పటికే అతనిమీదా దొంగతనం కేసు నడుస్తోంది. దొంగల అస్తులను కూడా టీటీడీకి అవసరమా..శ్రీనివాసుడు అంతా ఇబ్బంది పడుతున్నాడా అన్నది ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నగా మారింది. అయితే పోలీస్ శాఖలో సిఐ స్థాయి అధికారి ఎవిఎస్ ఓ..అతనిపైన డిఎస్పి స్థాయి విజివో, ఎస్పీ స్థాయి సివి అండ్ ఎస్వో ఉంటారు. వారిద్దరి అనుమతి లేకుండా కేసులో రాజీ అయ్యి ఉంటాడా..సివి అండ్ఎస్వో సైతం ఈవో ,చైర్మన్ కనుసన్నలలో నడవాల్సిందే …ఇలాంటప్పుడు స్వంతంగా ఏవిధంగా ఎవిఎస్వో రాజీ అవుతాడు అన్నది ఇప్పుడు చర్చించాల్సిన విషయం అంటున్నారు..

ఇంప్లీడ్ చేయాలంటూ శ్రీనివాసనందా సరస్వతి హైకోర్టులో పిటిషన్:

ఈ కేసులో తమను ఇంప్లీడ్ చేయాలంటూ సాదు పరిషత్ అధ్యక్షుడు అయిన శ్రీనివాసనందా సరస్వతి హౌకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు . ఆ క్రమంలో కేసులో చోటుచేసుకున్న పరిణామాలపై అనేక అనుమానాలు లెవనెత్తుతున్నారు అయన. దీంతో పాటు ఎవిఎస్ఓ స్థాయి అధికారి రాజీ చేసుకోవడం వెనుక ఏం జరిగింది బయటకు రావాలంటున్నారు. మరో వైపు ఎవిఎస్ఓగా పనిచేసి రాజీ అయిన సతీష్ సైతం కౌంటర్ అపడవిట్ దాఖలు చేశారు. ఫిర్యాదు దారుడిని కాబట్టి రాజీ అయ్యే హక్కు ఉందని అంటన్నాడు.

చట్టాన్ని అడ్డం పెట్టుకుని కీలక పాత్ర వహించిన ఎవిఎస్ఓ:

అయితే ఉన్నతాదికారుల సూచన మేరకు అని దాఖలు చేసినట్లు తెలుస్తోంది..ఐపిసి, సీఅరీపిసి కేంద్ర చట్టాలని వాటి ప్రకారం రాజీ అయ్యానని అంటున్నారు.. అయితే తన వ్యక్తి గత కేసు అయితే ఆ విధంగా చేసుకోవచ్చు. ప్రపంచంలోని అతిపెద్ద దార్మిక సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి స్వామి వారి హుండి సోమ్మును దొంగతనం చేస్తే రాజీ చేసుకోవడానికి హక్కు ఉందని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం హాస్యాస్పదమని అంటున్నారు నిపుణులు.. చట్టాలను అడ్డం పెట్టుకుని ఈ కేసులో కీలక పాత్ర వహించిన వ్యక్తులు ఎవిఎస్ఓతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయించారనే ప్రచారం జరుగుతుంది.

పరకామణి దొంగతనం పై టిటిడి మాజీ చైర్మన్:

పరకామణిలో దొంగతనం చేసినవ్యక్తి ద్వారా అస్తులు రాయించడం గతంలో ఎన్నడూ జరగలేదని ఇప్పటికే టిటిడి మాజీ చైర్మన్ భూమన కూడా వాదిస్తున్నారు.. ఇలాంటి నేపథ్యంలో మరో సారి కౌంటర్ దాఖలు చేయించడంతో పాటు టిటిడి సైతం తమకు తెలియకుండా రాజీ అయ్యారనే చెప్పడం చూస్తుంటే పెద్ద స్థాయిలో కేసును మూసి వేయించే దిశగా చర్యలు జరుగుతున్నాయని సామాన్య భక్తులు సైతం అభిప్రాయపడుతున్నారు..

విజిలెన్స్ రిపోర్టు ఇచ్చి ఏడాది అవుతున్నా చర్యలు లేవు:

ఓ వైపు రాష్ట ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్ పోర్స్ మెంట్ రిపోర్టు ఇచ్చిన ఏడాది అవుతున్నా చర్యలు లేవు. మరో వైపు టిటిడిలో డిప్యూటీల బదిలీలు సైతం అపివేశారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పరకామణి కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి మరో సారి టిటిడి బోర్డు ప్రతిష్టను పెంచుకునే ప్రయత్నం చేస్తుందా అన్న చర్చ మొదలయింది. దీనికితోడు తనకు తెలియకుండా టిటిడిలో ఏం జరగదు అంటు మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు.ఈ నేపథ్యంలో 28 వతేది జరిగే పాలకమండలి సమావేశం హాట్ హాట్ గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు..చూడాలి మరి ఏం జరుగుతుందో.

Story by Apparao, Big tv 

Related News

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ నేతల ప్రచారంపై కేటీఆర్ ఆరా

Private Bus: జనం ప్రాణాలతో.. ప్రైవేట్ ట్రావెల్స్ ఆటలు !

CM Revanth: రైతుల భూ సమస్యలకు.. సీఎం రేవంత్ శాశ్వత పరిష్కారం

CM Revanth: పట్టణ ప్రాంత పేదలకు శుభవార్త జీ+1 తరహాలో.. ఇందిరమ్మ ఇండ్లు

West Godavari: పశ్చిమ టీడీపీ పగ్గాలు ఎవరికో?

Pocharam Srinivas: చెప్పుతో కొట్టండి! పోచారం స్వరం మారుతుందా?

Dharmana prasada : కొడుకు ఎంట్రీ.. రాజకీయాలకు ధర్మాన గుడ్ బై..!

Big Stories

×