OTT Movie : ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ లో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తక్కువ సమయంలోనే, ఎక్కువ కంటెంట్ ఇచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఇక హారర్ స్టోరీలకు అంతే లేదు. భయంకరమైన షార్ట్ హారర్ స్టోరీలు లెక్కలేనన్ని ఉన్నాయ్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ, హారర్ లవర్స్‌కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇది కేవలం 6 నిమిషాల షార్ట్ ఫిల్మ్. కానీ చాలా భయంకరమైనది. ఇది సూపర్‌నాచురల్ హారర్, EC కామిక్స్ స్టైల్ ఎండింగ్‌తో చివరి మినిట్ గుండెని ఉలిక్కి పడేలా చేస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘కిస్స్డ్’ (Kissed) అనే షార్ట్ ఫిల్మ్ 2020లో విడుదలైన అమెరికన్ హారర్ షార్ట్ ఫిలిం. దీన్ని ఎల్వుడ్ క్వింసీ వాకర్ అనే డైరెక్టర్ రాసి, తీశాడు. ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రైజ్‌లు, ఐయండిబిలో 5.9/10 రేటింగ్ ను ఈ షార్ట్ ఫిలిం సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇది యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
నార్మన్ అనే వ్యక్తి ఒక హాస్పిటల్ లో మార్చురీలో పని చేస్తుంటాడు. ఒక యువతి మృత దేహం అక్కడికి వస్తుంది. ఆమె లేక్‌లో మునిగి చనిపోయిందని తెలుస్తుంది. నార్మన్ తన పని చేస్తూ, ఆమెతో మాట్లాడటం మొదలు పెడతాడు. ఆమె చాలా అందంగా ఉందని, ఇతర మృతదేహాల్లా మురికి లేదని ఆమెతో చెబుతాడు. అతని మాటలు సాధారణంగా మొదలవుతాయి, కానీ క్రమంగా అతని ఇంటెన్స్ ఎక్కువవుతుంది. సినిమా పాత స్టైల్ మ్యూజిక్‌తో మొదలై, క్లాసిక్ హారర్ ఫీల్ ఇస్తుంది.
Read Also : మొదటి రాత్రే వదిలేసే భర్త… ఫొటోగ్రాఫర్ తో పని కానిచ్చే భార్య… మనసుకు హత్తుకునే రొమాంటిక్ డ్రామా