E-Paper
Advertisement

Bapatla Crime: అయ్యో! ఎంత పని చేశావు చిన్నా.. ఆడుకుంటూ వెళ్ళి బావిలో పడి..

Bapatla Crime: అయ్యో! ఎంత పని చేశావు చిన్నా.. ఆడుకుంటూ వెళ్ళి బావిలో పడి..
Advertisement

Bapatla Crime:  బాపట్ల జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన ఓ చిన్నారి ప్రమాదవశాత్తూ బావిలో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన దరివాడ కొత్తపాలెం గ్రామంలో జరిగింది.

దరివాడ కొత్తపాలెం గ్రామానికి చెందిన ఓ బాలుడు నిన్న సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. చీకటి పడుతున్నా బాలుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. సమయం గడుస్తున్న కొద్దీ బాలుడి ఆచూకీ లభించకపోవడంతో గ్రామస్తుల సహాయంతో రాత్రంతా వెతికారు. పొలాలు, ఖాళీ ప్రదేశాలు ఇలా అన్నిచోట్లా గాలించినా ఫలితం లేకపోయింది.

Advertisement

చివరికి ఈరోజు తెల్లవారుజామున గ్రామ సమీపంలోని ఓ బావిలో బాలుడి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ బావిలో పడిపోవడం వల్లే బాలుడు మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు. అప్పటివరకు తమ కళ్లముందే తిరుగుతూ సందడి చేసిన చిన్నారి, ఇలా విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ ఘటనతో దరివాడ కొత్తపాలెం గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. అభం శుభం తెలియని చిన్నారి మృతి పట్ల గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ALSO READ:  సిగరెట్ లైటర్ కోసం గొడవ.. ప్రాణ స్నేహితుడే కాలయముడయ్యాడు.. ఇంత ఘోరమా!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×