Dharmavaram News: శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ధర్మవరం పట్టణ కేంద్రంలో ఈ రోజు సాయంత్రం ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు. వేట కొడవళ్లతో హత్య చేసిన ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
సీసీటీవీ ఫుటేజ్
(Sensitive )నడిరోడ్డుపై విచక్షణారహితంగా హత్య చేసిన దుండగులు https://t.co/vOmqmazIXi pic.twitter.com/0U4vGZbA8W
— ChotaNews App (@ChotaNewsApp) September 4, 2025
గుర్తు తెలియని వ్యక్తిని ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా వెనుక నుంచి కారుతో ఢీకొట్టారు. అనంతరం కిందపడిపోయిన అతనిని అత్యంత కిరాతకంగా వేట కొడవళ్లతో నరికి చంపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. స్థానికుల సమాచారం మేరక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: JOB IN APMSRB: ఏపీలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. లక్షల్లో వేతనం, దరఖాస్తుకు కొన్ని రోజులే గడువు