Bus Fire: ఈ మధ్యకాలం తెలుగు రాష్ట్రాల్లోని బస్సులు అగ్నిప్రమాదాలకు గురవుతున్నాయి. డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదాలు తప్పాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి కరీంనగర్‌లో జిల్లాలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అసలేం జరిగింది?
కరీంనగర్ జిల్లాలో ఘోరం.. బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లాలో ఓ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో బస్సులో దాదాపు 41 మంది ప్రయాణికులు ఉన్నారు వారంతా సురక్షితంగా బయటపడ్డారు.
కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరింది. అందులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే బస్సు.. అలుగునూరు దాటిన తర్వాత ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు నుంచి పొగ వాసన రావడం గమనించిన డ్రైవర్, రోడ్డు పక్కన ఆపివేశారు.
బస్సులో 41 మంది ప్రయాణికులు.. డ్రైవర్ జాగ్రత్తగా వ్యవహరించడంతో తప్పిన ముప్పు
పరిస్థితి గమనించిన ఆయన, బస్సు డోర్‌తోపాటు ఎమర్జెన్సీ ద్వారాన్ని తెరిచి ప్రయాణికులను అలర్ట్ చేశారు. ప్రయాణికులు కిందకు దిగిన కొన్ని నిమిషాల వ్యవధిలో మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది బస్సు. ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో అంతా సేఫ్‌గా బయటపడ్డారు. దీంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. ఈ ఘటన వెనుక షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని బస్సు డ్రైవర్ చెబుతున్నమాట.
ALSO READ: ఒకప్పుడు శివమణి.. ఇప్పుడు నెంబర్ వన్ కేడీ!
అలుగునూర్ వద్ద ఎలక్ట్రికల్ బస్సులో మంటలు
కరీంనగర్ జిల్లా అలుగునూర్ రాజీవ్ రహదారిపై ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఎలక్ట్రికల్ బస్సులో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమవ్వడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది.#Karimnagar #BusAccident… pic.twitter.com/B8zob5aovE
— BIG TV Breaking News (@bigtvtelugu) June 21, 2026