శివమణి సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. పూరీ డైరెక్షన్‌లో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ హిట్ సినిమా. నా పేరు శివమణి.. నా కొంచెం మెంటల్! ఈ డైలాగ్ కూడా ఫేమస్సే. పూర్ణ మార్కెట్‌కు వెళ్లు.. అక్కడ ఎవడినైనా అడుగు.. శివమణితో పెట్టుకోవచ్చా..? అని. ఒక్కడైనా పెట్టుకోవచ్చు.. అంటే నేను నీ జోలికి రాను..! అని సవాల్ విసిరే క్యారెక్టర్.
శివమణి.. 9848022338.. ఎప్పుడైనా ఫోన్ చేస్తే చాలు.. ఇలా వచ్చి సెకన్లలో మీ ముందుంటా! అనే డేరింగ్ అండ్ డాషింగ్ క్యారెక్టర్. పూరీ జగన్నాథ్ మార్క్ సినిమా. నాగార్జునకు మాస్ అప్పీల్‌ను పెంచిన మూవీ. ఇప్పుడిదంతా ఎందుకు సోదీ? అనుకుంటన్నారా? ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు.. .పీ సీత రామాంజనేయులు.. నేపథ్యం కూడా ఇంతే ఘనంగా ఉంది. వర్తమానం చాలా వరెస్ట్ అయిపోయిందనుకో. ఇప్పుడదే మన డిస్కషన్!
ఐపీఎస్‌గా కొత్తగా రాగానే తనదైన స్టైల్‌లో హల్ చేశాడు పీఎస్ఆర్. ఎవరికీ వినడు. ఎవరి మాట లెక్క చేయడు. ఒక్కొక్కరిని వణికించాడు.. కామన్‌గా అతని గురించి ఐడియా ఉన్న ప్రతీ ఒక్కరు చెప్పే మాటలు. కానీ అది కెరీర్ ప్రారంభంలో. ఆ తరువాత ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్న క్రమంలో కీలకమైన బాధ్యతలు చేపడుతూ ఉన్న సందర్భం.. పక్కదారి పట్టించింది.
అధికార దుర్వనియోగానికి తెర లేపాడు.తనలోని అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. పోలీస్ అంటే ఇంత కర్కశంగా ఉంటాడా? అనే విధంగా అతడి ప్రవర్తన బయటపడుతూ వచ్చింది. అదెంత వరకు పోయిందంటే.. శివమణిలా హీరోయిజం చెలాయించిన ఈ ఐపీఎస్.. విలన్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా.. ఘోరంగా దిగజారి పోయి.. జైలు ఊచలు లెక్కపెట్టేంత దాకా.
తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ ఐపీఎస్ తన దూకుడు చూపించాడు. ఏపీ క్యాడర్‌కు చెందిన ఈ ఆఫీసర్.. తెలంగాణ ఉద్యమాన్ని అణిచేందుకు సాగిన పాలకుల ప్లానింగ్‌ని పక్కాగా ఫాలో అయ్యాడు. వారితో షబ్బాశ్ అనిపించుకున్నాడు కూడా. ఆ తరువాతే అతని పతనం స్టార్ట్ అవుతూ వచ్చింది. కీలకమైన ప్రమోషన్లు పొందుతూనే .. వాటి ద్వారా వచ్చిన పరపతిని దుర్వినియోగం చేసుకుంటు సర్వీసును చెదలు పట్టించుకున్నాడు.
మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ కే రఘురామ కృష్ణ రాజు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఓ కేసు నమోదైంది. తనను కస్టడీలో టార్చర్ పెట్టాడని. సీఐడీ కస్టడీలో తనపై హింస జరిగిందని ఆయన ఆరోపించారు. ఆ సమయంలో ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న అధికారుల పాత్రపై దర్యాప్తు కొనసాగింది. ఇతనే కీలక సూత్రధారి. ముంబైకి చెందిన నటి కాదంబరి జెట్వానీ అరెస్టు వ్యవహారంలో అధికార దుర్వినియోగం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో మళ్లీ వెలుగులోకి వచ్చాడు. వార్తల్లో కేంద్రబిందువయ్యాడు. కేసులో ఆయనపై విచారణలు జరిగాయి, జైలు ఊచలు కూడా లెక్కించాడు.