E-Paper
Advertisement

Shadnagar Accident: షాద్‌నగర్‌లో ఘోర ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు

Shadnagar Accident: షాద్‌నగర్‌లో ఘోర ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు
Advertisement

Shadnagar Accident: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చటాన్‌పల్లి వద్ద చెరువులో కారు బోల్తా పడింది. ఘటన గురించి తెలియగానే పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మెల్లగా కారుని చెరువు నుంచి బయటకు తీశారు.

షాద్‌నగర్‌లో ఘోర ప్రమాదం

Advertisement

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణ సమీపంలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ఓ కారు, చటాన్‌పల్లి వద్ద చెరువులోకి దూసుకెళ్లింది. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు అలర్ట్ అయ్యారు. వెంటనే చెరువు వద్ద ఏదో శబ్దం రావడంతో అక్కడికి తరలి వచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులతోపాటు కారుని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే చెరువు లోతుగా ఉండడంలో బయటకు తీయడం కష్టంగా మారింది. రెండు మూడు గంటల పాటు శ్రమించి తాళ్లతో కారుని బయటకు తీశారు. కారును బయటకు తీసిన తర్వాత అందులో ఎవరు కనిపించలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

చెరువులోకి దూసుకెళ్లిన కారు, షాకైన పోలీసులు

ఎవరైనా చెరువులో పడిపోయారా? కారు చెరువులో పడిన తర్వాత వెళ్లిపోయారా? కారులో లోపలికి వెళ్లిందంటే అందులో ఎవరైనా ఉండవచ్చన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. రాత్రి వేళ స్థానికులు సహాయంలో చేయడంతో పోలీసులు అభినందనలు తెలిపారు. ఈ ఘటన వెనుక ఏం జరిగింది? లేకుంటే దృశ్యం సీన్ రిలీట్ అవుతుందా? అనేది చూడాలి.  కారు నెంబరు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×