Road Accident: అతివేగం ప్రమాదకరం.. రహదారులపై పదే పదే బోర్డులున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది. వేగంగా వస్తున్న ఓ కారు, డివైడర్‌ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది?
రాజస్థాన్‌లోని దౌసాలో ఘోర రోడ్డు ప్రమాదం
రాజస్థాన్‌లో దౌసా జిల్లాలోని 21వ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు మరణించారు. మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కైలై గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.
ఎదురుగా వస్తున్న ట్రైలర్‌ను ఢీ కొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. అందులో ఐదుగురు స్పాట్ లో మృతి చెందారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనలో కారు నుజ్జుకావడంతో మృతదేహాలను బయటకు తీయడం కష్టంగా మారింది.
డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురు మృతి
చివరకు వారిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడ్ని జైపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్నవారు కలఖో గ్రామానికి చెందినవారు. ఓ వివాహం తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు గాయపడ్డారు. దీంతో కలఖో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అతివేగం వల్ల వాహన నియంత్రణ కోల్పోవడం ప్రమాదానికి కారణమైనట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదం గురించి తెలియగానే యువకుల కుటుంబ సభ్యులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. తమ కొడుకులను ఆ విధంగా చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.
ALSO READ: 13 కీ.మీ తమ్ముడి శవాన్ని బైక్‌పై తరలించిన అన్నదమ్ములు!