E-Paper
Advertisement

ప్రియుడితో కలిసి తల్లిని చంపిన టీనేజ్ యువతి, ఫ్రిజ్‌లో మృతదేహం, ఎందుకో తెలిస్తే షాకవుతారు

ప్రియుడితో కలిసి తల్లిని చంపిన టీనేజ్ యువతి, ఫ్రిజ్‌లో మృతదేహం, ఎందుకో తెలిస్తే షాకవుతారు
Advertisement

Jharkhand Horror: కష్టపడటానికి ఇష్టం లేని ఓ టీనేజ్ యువతి బరి తెగించింది. ఉద్యోగం, డబ్బుల కోసం తన ప్రియుడితో కలిసి దత్తత తీసుకుని తల్లిని అత్యంత దారుణంగా చంపేసింది. పైగా మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పెట్టింది. సంచలనం రేపిన ఈ ఘటన జార్ఖండ్‌లో వెలుగు చూసింది అసలేం జరిగింది?

జార్ఖండ్ రాజధాని రాంచీలో దారుణం

Advertisement

జార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన నహీదా పర్వీన్ ఫ్యామిలీ ఉండేది. నహీదా ఫ్యామిలీకి పిల్లలు లేకపోవడంతో బాలికను దత్తత తీసుకుంది. ఐదేళ్ల కిందట నహీదా పర్వీన్ భర్త చనిపోయాడు. ఆయన విద్యుత్ శాఖలో పని చేసేవాడు. భర్త మరణించడంతో పరిహారంగా రూ.45 లక్షలు ప్రభుత్వం నుంచి నహీదాకు అందాయి. ఆ డబ్బును తన అకౌంట్లో వేసుకుంది.

నామినీగా 17 ఏళ్ల దత్త పుత్రిక పేరు పెట్టింది. ఇంతవరకు బాగానే జరిగింది. ఆ టీనేజ్ యువతి 20 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. దీంతో వీరిద్దరు మరింత డీప్ అయ్యారు. తల్లికి తెలియకుండా ప్రియుడికి డబ్బు ఇవ్వడం మొదలుపెట్టింది యువతి. ఈ విషయం తెలుసుకున్న తల్లి నహీదా.. కూతురిని మందలించింది.

Advertisement

డబ్బు, ఉద్యోగం కోసం ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు

అక్కడి నుంచే ఆ యువతి అసలు ప్లాన్ చేసింది. తల్లి ఉన్నంతకాలం ప్రియుడితో హాయిగా ఉండలేనని భావించింది. తల్లిని చంపిస్తే డబ్బు, తండ్రి ఉద్యోగం వస్తుందని భావించింది. పక్కాగా ప్లాన్ అమలు చేసింది. తల్లి హత్యకు ఏకంగా రూ.12 లక్షలు ఖర్చు చేసిందట. ఏప్రిల్ 24న రాత్రి నహీదా నిద్రపోతోంది.

ఆ సమయంలో యువతి తన ప్రియుడి, వాడి స్నేహితులు కలిసి తల్లి ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది. చింపేసిన విషయం బయటకు తెలియకుండా ఫ్రిజ్‌లో మృతదేహాన్ని పెట్టింది. రెండు రోజుల తర్వాత బాత్రూంలో జారిపడి చనిపోయిందని బంధువులను నమ్మించింది. ఆ తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు.

ALSO READ: హైదరాబాద్‌ నారాయణగూడలో భారీ అగ్నిప్రమాదం.. ఎగ‌సిప‌డుతున్న మంట‌లు.. ఇదిగో వీడియో!

అంత్యక్రియల సమయంలో నహీదా శరీరంపై గాయాలు ఉండడంతో ఆమె బావకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, బాలికను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు గుట్టు అంతా బయటపడింది.

విచారణలో తల్లిని తాను హత్య చేయించినట్లు అంగీకరించింది. యువతిని అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌లోని గయా జిల్లాలో యువతి ప్రియుడితోపాటు సహాయపడిన మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని జిల్లా పోలీసులు అధికారులు వెల్లడించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×