E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Jetlee Twitter Review : ‘జెట్లీ’ ట్విట్టర్ రివ్యూ.. కమెడియన్ సత్య హిట్ కొట్టాడా..?

Jetlee Twitter Review : ‘జెట్లీ’ ట్విట్టర్ రివ్యూ.. కమెడియన్ సత్య హిట్ కొట్టాడా..?
Advertisement

Jetlee Twitter Review : టాలీవుడ్ ఇండస్ట్రీలోని కమెడియన్లు ఈమధ్య హీరోలుగా మారి వరసగా సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది స్టార్స్ వరుస సినిమాలతో బిజీగా మారారు. ఇప్పుడు మరో స్టార్ కమెడియన్ సత్య హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.. ఆయన నటించిన తాజా చిత్రం జెట్లీ.. మత్తు వదలరా’ సినిమాల్లో ఫుల్ కామెడీ చేయించిన రితేష్ రాణా ఈ సినిమాకు దర్శకుడు… రియా సింఘా హీరోయిన్ గా నటించారు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు ఇవాళ భారీ అంచనాలతో వచ్చేసింది.. మే డే సందర్భంగా ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయింది.. మరి ఈ మూవీ టాక్ ఎలా ఉంది.? దీనిపై జనాల స్పందన ఎలా ఉంది అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..

కమెడియన్ గా సత్య ఎన్నో సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.. ఇప్పటివరకు ఈయన నటించిన ప్రతి సినిమా కూడా జనాలని బాగా ఎంటర్టైన్ చేసింది.. జెట్లీ మూవీ కి మొదటి నుంచి అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకు మంచి క్రేజ్ కూడా వచ్చింది. ఇప్పటివరకు ఇలాంటి కామెడీ ఎంటర్టైనర్ మూవీ ని ప్రేక్షకులు చూడలేదని చెప్పాలి. మరి ఇవాళ రిలీజ్ అయిన ఈ సినిమా మౌత్ టాక్ ఎలా ఉంది? నెటిజన్ల రియాక్షన్ ఏంటి అన్నది ట్విట్టర్ రివ్యూ లో చూసేద్దాం…

Advertisement

దర్శకుడు రితేష్ రాణాకు ఒక స్టైల్ ఉంది. ‘మత్తు వదలరా’ రెండు పార్టులు, ఆ మధ్యలో తీసిన ‘హ్యాపీ బర్త్ డే’.. కామెడీ ఎంటర్టైనర్ గా జనాలని బాగా ఆకట్టుకుంది.. ఒక్క మాటలో చెప్పాలంటే కామెడీ సినిమాలకు ఈయన కేరాఫ్ అని చెప్పాలి.. ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంటుంది అంటూ ఓ నెటిజను ట్విటర్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Advertisement

జెట్లీ మూవీ క్రేజీ ఫన్.. రితీష్ రానా తెరకెక్కించిన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఇంకాస్త క్రేజీగా ఉంది. నాన్ స్టాప్ కామెడీ మూవీ. సత్య వన్ మ్యాన్ షో గా అదరగొట్టేసాడు. తన కోసమైనా నేను రెండు సార్లు సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

రితేష్ రానా మరోసారి తన కామెడీ మార్కు ని చూపించారు. ప్రతి సీను కూడా కామెడీతో చాలా బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫోన్ ఎంటర్టైన్మెంట్. సత్య, వెన్నెల కిషోర్ ఇద్దరు కూడా ఎవరికి వారే అన్నట్లు పోటీపడి మరీ నటించారు.. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అంటూ ఓ నెటిజను ట్వీట్ చేశారు.

జెట్లీ మూవీ కి జనాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది అని ట్విట్టర్ రెస్పాన్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి సత్య హీరోగా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ జనాలని విపరీతంగా ఆకట్టుకుంది అని ప్రస్తుతం పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వినిపిస్తుంది. ఇదే టాక్ ఇవాళ కొనసాగుతుందని సత్య అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. మరి కలెక్షన్లు ఏ మాత్రం వసూలు చేస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే..

Related News

Deewana Review : ‘దీవానా’ రివ్యూ: ప్రేమాయణం బానే ఉంది కానీ.. కొంచెం ఓపిక చేసుకొని చూడాలి భయ్యో!

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ రివ్యూ: వడ్డే నవీన్ కమ్‌బ్యాక్ రివర్స్ కొట్టిందా?

‘మా ఇంటి బంగారం’ మూవీ రివ్యూ.. సామ్ హిట్ కొట్టినట్టేనా?

Vanda Devullu : విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ రివ్యూ: బిచ్చగాడు రేంజ్ ఉందా?

కొత్త మలుపు రివ్యూ: సింగర్ సునీత కొడుకు హిట్ కొట్టాడా? సినిమా ఎలా ఉందంటే?

‘సింగ్-గీతం’ మూవీ రివ్యూ.. సింగీతం గారి ‘సంగీత’ ప్రయోగం ఎలా ఉందో తెలియాలంటే?

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

Peddi Twitter Review : ‘పెద్ది’ మూవీ ట్విట్టర్ రివ్యూ..రామ్ చరణ్ హిట్ కొట్టాడా..?

Big Stories

×