BigTV English

Raayan Piracy: ధనుష్ ‘రాయన్’ పైరసీ..కీలక వ్యక్తి అరెస్ట్

Raayan Piracy: ధనుష్ ‘రాయన్’ పైరసీ..కీలక వ్యక్తి అరెస్ట్

Dhanush Raayan Movie piracy video comes out..Stephen Raj Tamilnadu: సినిమా ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తున్న సమస్యలలో ఒకటి పైరసీ భూతం. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా ఈ పైరసీ బారిన పడుతున్నాయి. ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ వీడియోలు వైరల్ గా బయటకు వచ్చేస్తున్నాయి. సైబర్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. తాజాగా తమిళ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన రాయన్ మంచి హిట్ టాక్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అంతలోనే పైరసీ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. విషయం తెలిసి నిర్మాతలు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. అయితే దీని వెనుక తమిళ రాకర్స్ మాఫియా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలోనూ కొన్ని పైరసీలు విడుదల చేయడంలో కేసులు ఎదుర్కొన్నారు తమిళ రాకర్స్. ఇందుకు సంబంధించి ఆ ముఠా కీలక సభ్యుడు స్టీఫెన్ రాజ్ ను తమిళనాడు పోలీసులు స్వాధీనంలో తీసుకున్నారు. పోలీసులు తమదైన స్టయిల్ లో నిందితుడి నుంచి కొన్ని కీలక విషయాలు రాబట్టారు.


వెనక సీట్లో కూర్చుని దర్జాగా పైరసీ

ముందుగా కొద్దిగా ఎక్కువ పేమెంట్ చేసి సినిమా హాల్స్ లో అందరి కన్నా వెనక సీట్లు బుక్ చేసుకుంటారు. వీళ్లకి సినిమా థియేటర్ సిబ్బందికి ఉన్న అండర్ స్టాండింగ్ ఆధారంగా ఇక తమ చీకటి వ్యవహారాన్ని నడిపిస్తుంటారు. ఎత్తయిన మొబైల్ స్టాండ్ కు తమ మొబైల్స్ ను అమరుస్తారు. సెల్ ఫోన్ లలో బ్రైట్ నెస్ తగ్గించేస్తారు ముందు సీట్లలో కూర్చొన్నవారికి అనుమానం రాకుండా.. సినిమా పూర్తయ్యేదాకా తమ మొబైల్స్ లో షూట్ చేస్తుంటారు. అవి హై రిజల్యూషన్ మొబైల్స్ కావడంతో ఈజీగా బొమ్మను క్లారిటీగా క్యాచ్ చేసేస్తాయి. తర్వాత పేరున్న వెబ్ సైట్లతో ఒప్పందం కుదుర్చుకుని వాళ్లకు వీడియోను షేర్ చేస్తారు. అలా ఒకేసారి కొన్ని ఛానల్స్ తో మనీ ఒప్పందం చేసుకుని విడుదల చేస్తుంటారు.


పెట్టుబడి లేని వ్యాపారం

దీనితో లక్షల్లో ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే సొమ్ములు వచ్చిపడుతుంటాయి వీరికి. కోట్లు ఖర్చుపెట్టి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి లాభాలను పొందాలనుకునే నిర్మాతలు రెండో షో నుంచే థియేటర్లకు జనం రావడం మానేయడంతో ఏం చెయ్యాలో తెలియక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నిందితులు కూడా ఏదో రకంగా బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు. మళ్లీ షరా మామూలే..తమిళనాడు తరహాలోనే తెలుగు నాట నిర్మాతలు కూడా పైరసీ బారిన పడుతున్నారు. వీటికి పరిష్కారం దిశగా చాలా కాలంగా ప్రయత్నిస్తునే ఉన్నారు. కానీ పైరసీ భూతాన్ని మాత్రం అరికట్టలేకపోతున్నారు.

రాయన్ మూవీ పైరసీ వ్యవహారంలో అప్రూవల్ గా దొరికిపోయిన స్టీఫెన్ రాజ్ వెనక ఉన్న కీలక వ్యక్తులు ఎవరు? ఎంతకాలంగా పైరసీ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు? ఏ ఏ ఛానల్స్ తో వీరికి సంబంధాలు ఉన్నాయి. వంటి విషయాలను పోలీసులు కూపీ లాగుతున్నారు. జనం మాత్రం ఏదో కొద్ది రోజులు మాత్రమే పోలీసులు దీనిపై దృష్టిపెడతారే తప్ప దీనికి శాశ్వత పరిష్కారం సూచించడం లేదని అంటున్నారు. అవసరమైతే పైరసీ పై కఠిన చట్టాన్ని అమలు చేసి నిందితులకు పదేళ్ల పాటు జైలు శిక్ష పడేలా చెయ్యాలని..అప్పుడే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుందని అంటున్నారు.

Related News

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Medak District: రెచ్చిపోతున్న కామాంధులు.. ఛీ ఛీ గేదెపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

Doctor Negligence: ఫుల్‌గా తాగి నిద్రపోయిన డాక్టర్.. నవజాత శిశువు మృతి

Vijayawada News: ఏపీ పోలీసులకు చెమటలు.. చెర నుంచి తప్పించుకున్న బత్తుల, తెలంగాణ పోలీసుల ఫోకస్

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

Big Stories

×