BigTV English

Dulquer salmaan Birthday Special: దుల్కర్ సల్మాన్ బర్త్ డే స్పెషల్.. ఇంట్రెస్టింగ్ టైటిల్ తో కొత్త సినిమా పోస్టర్

Dulquer salmaan Birthday Special: దుల్కర్ సల్మాన్ బర్త్ డే స్పెషల్.. ఇంట్రెస్టింగ్ టైటిల్ తో  కొత్త సినిమా పోస్టర్

Dulquer Salmaan Birthday Special new Telugu film titled Aakasamlo Oka Tara: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. తండ్రికి తగ్గ తనయుడిగా మమ్ముట్టి కుమారిడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తన టాలెంట్ తో తక్కువ సమయంలోనే స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. దుల్కర్ సల్మాన్ మలయాళ నటుడు మమ్ముట్టి, సల్ఫాత్ లకు 1978 జులై 28న జన్మించాడు.


మలయాళం లో “సెంకండ్ షో” అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత “ఉస్తాద్ హోటల్” అనే మరో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మలయాళంలో వరుస సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్ “మహానటి” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే ఘన విజయం సాధించాడు. తమిళం, మలయాళం, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు.

కురుప్, ఓకే బంగారం, కనులు కనులను దోచాయంటే, పరిణయం, జనతా హోటల్‌, హే సినామికా(2022), సెల్యూట్ (2022) అందమైన జీవితం, కింగ్ ఆఫ్ కొత్త (2023),పలు సినిమాల్లో నటించాడు. ఆతర్వాత “సీతారామం” అనే సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించింది. దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం “లక్కీ భాస్కర్” సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత తన నెక్ట్స్ సినిమా గీతా ఆర్ట్స్ అనౌన్స్ చేసింది. యువ దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న సినిమా “ఆకాశంలో ఒక తారా”..


నేడు దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ “ఆకాశంలో ఒక తారా” అనే మూవీ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రం యూనిట్. ఇది త‌నపుట్టిన రోజుకి ప‌ర్‌ఫెక్ట్ గిఫ్ట్ అని దుల్కర్ సల్మాన్ తెలిపారు. ఈ మూవీని స్వప్న సినిమాస్, లైట్ బాగ్స్ మీడియా, అలాగే గీతా ఆర్ట్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ, తమిళం భాషల్లో రీలీజ్ చేయనున్నట్లు చిత్రం యూనిట్ పేర్కొంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×