BigTV English

The RajaSaab : అప్డేట్ వచ్చిందిరోయ్.. రాజాసాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ సెలబ్రేషన్స్ కు రెడీ అవ్వండి

The RajaSaab : అప్డేట్ వచ్చిందిరోయ్.. రాజాసాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ సెలబ్రేషన్స్ కు రెడీ అవ్వండి

The RajaSaab Fan India Glimpse : కల్కి 2898 ADతో మరో పాన్ ఇండియా హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్.. ఇప్పుడు రాజా సాబ్ పై ఫోకస్ పెట్టాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ కు డైరెక్టర్ మారుతి గుడ్ న్యూస్ చెప్పారు. రేపు సాయంత్రం.. అంటే జూలై 29వ తేదీ సాయంత్రం 5.03 గంటలకు ది రాజాసాబ్ సినిమా నుంచి ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మారుతి X వేదికగా పోస్ట్ పెట్టారు.


కల్కి సినిమా రూ. 1100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ లో ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్.. ఇప్పుడు ది రాజాసాబ్ సినిమా నుంచి అప్డేట్ రావడంతో సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. రేపు సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు గ్లింప్స్ రావడమే ఆలస్యం.. థియేటర్లలో రచ్చ రచ్చ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక రాజాసాబ్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇప్పటివరకూ సగం షూటింగ్ ను పూర్తిచేసుకోగా.. మిగతా షూటింగ్ ఆగస్టు నుంచి పట్టాలెక్కనుంది. డైరెక్టర్ మారుతి.. హారర్ కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. ప్రేమ కథా చిత్రమ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన మారుతి.. భలే భలే మగాడివోయ్, మంచిరోజులొచ్చాయి, మహానుభావుడు వంటి విభిన్న కామెడీ జోన్ చిత్రాలు తీసి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.


ఇప్పుడు తీస్తున్న ది రాజాసాబ్ సినిమా కూడా హారర్ కామెడీ సినిమానే అని టాక్ ఉంది. ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి రాజాసాబ్ లో ప్రభాస్ ను మారుతి ఎలా చూపిస్తారోనని ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×