BigTV English

Mohammed Kaiser: హైదరాబాద్ రౌడీ షీటర్‌కు ఈడీ ఝలక్, ఆస్తులు సీజ్

Mohammed Kaiser: హైదరాబాద్ రౌడీ షీటర్‌కు ఈడీ ఝలక్, ఆస్తులు సీజ్

Mohammed Kaiser: హైదరాబాద్‌లోని ఓ రౌడీ షీటర్‌కు షాకిచ్చారు ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ అధికారులు. అతడికి చెందిన ఆస్తులను జప్తు చేశారు. నేర కార్యకలాపాల ద్వారా వచ్చిన నిధులతో ఆస్తులు సమకూర్చినట్టు తేలింది. ఇంతకీ ఎవరు ఆ రౌడీ షీటర్? ఎక్కడ? అన్న డీటేల్స్‌లోకి వెళ్దాం.


పేరు.. మహ్మద్ కైసర్, లొకేషన్.. హబీబ్‌నగర్, తొలుత జేబు దొంగగా జీవితం ప్రారభించాడు. ఆ తర్వాత నేర కార్యకలాపాలు వైపు మొగ్గు చూపాడు. రౌడీషీటర్‌గా పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నేర సామ్రాజ్యం వైపు మొగ్గు చూపాడు. హత్యలు, జూదం, భూకబ్జాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఒకానొక దశలో జైలుకి వెళ్లాడు.

ఏళ్ల తరబడి అందులో ఉండిపోయాడు. బయటకు రాలేకపోయాడు. చివరకు నేర కార్యకలాపాలతో డబ్బును విపరీతంగా సంపాదించాడు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడు. కైసర్ తన భార్య షాహెదా బేగం పేరిట 2007 నుంచి 2020 భారీగా స్థిరాస్తులు కొనుగోలు చేశాడు. అన్నింటికీ క్యాష్ రూపంలో చెల్లింపులు చేసేవాడు.


ఇక్కడే ఈడీ అధికారులకు డౌట్ వచ్చింది. అసలే టెక్ యుగం.. ఆన్‌లైన్ సర్వీసు ఉపయోగించకుండా వ్యాపారాలు ఎలా చేశాడనే దానిపై కూపీ లాగారు. డొంక కదిలింది. ఆయన గురించి హైదరాబాద్ పోలీసుల నుంచి సమాచారం తీసుకున్నారు. డీటేల్స్ మొత్తం వచ్చాయి.

ALSO READ: పబ్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి, పట్టుబడిన వారిలో సినీ, రాజకీయ నేతల పుత్రరత్నాలు

ఈ క్రమంలో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది.  కోటి రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. అనధికారంగా చాలా మొత్తంలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో కైసర్ బంధువుల దృష్టి సారించారు. ఈడీ లాగిన తీగలో ఇంకెన్ని ఆస్తులు బయటపడతాయో చూడాలి.

 

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×