BigTV English

1000 Babies Review : బో*ల్డ్ సైకలాజికల్ థ్రిల్లర్… “1000 బేబీస్” రివ్యూ

1000 Babies Review : బో*ల్డ్ సైకలాజికల్ థ్రిల్లర్… “1000 బేబీస్” రివ్యూ

వెబ్ సిరీస్ పేరు : 1000 బేబీస్
స్ట్రీమింగ్ డేట్ : 18 అక్టోబర్ 2024
స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ప్లాట్ పాం : హాట్ స్టార్
ఎపిసోడ్స్ : 7
ప్రతి ఎపిసోడ్ నిడివి : 38 – 55
డైరెక్టర్ : నజీమ్ కోయా


1000 Babies Web Series Rating : 2.5/5

1000 Babies Review : మలయాళ మూవీ లవర్స్ తెరపై చూడడానికి ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నా వెబ్ సిరీస్ “1000 బేబీస్” (1000 Babies) ఈ శుక్రవారం తెరపైకి వచ్చింది. ఇందులో రెహమాన్ (Rahman), నీనా గుప్తా (Neena Gupta) తదితరులు ప్రధాన పాత్రలలో నటించగా, నజీమ్ కోయా దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో మలయాళ, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఎలా ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాన్ని తెలుసుకుందాం.


కథ

సారా అమ్మా గోడలపై ఒక మార్కర్ తో ఏదేదో రాస్తూ, పిచ్చిపిచ్చిగా అరుస్తూ ఉంటుంది. ఆమె కొడుకు బిపిన్ జోసెఫ్ ఆమెను జాగ్రత్తగా చూసుకుంటాడు. అయితే ఓ రోజు సడన్ గా కొడుకుకి మంచి మాంసం కూర వండి పెట్టి ఓ షాకింగ్ నిజాన్ని చెప్తుంది. దీంతో అప్పటిదాకా ఆమె చేష్టలన్నీ ఎంతో ప్రేమగా భరించిన ఆ కొడుకు ఒక్కసారిగా కోపోద్రిక్తుడై ఆమెపై దాడి చేస్తాడు. తర్వాత అతను ఇంటి నుంచి పారిపోగా, చుట్టుపక్కల వాళ్ళు సారా అమ్మను ఆసుపత్రిలో చేరుస్తారు. అక్కడ సారా అమ్మ ఓ లాయర్ కు, పోలీసులకు తను రాసిన లేఖలను ఇస్తుంది. ఇక ఆ లేఖలు చదివిన పోలీస్, మేజిస్ట్రేట్ ఈ విషయం బయటకు వస్తే ప్రమాదమని దాచి పెడతారు. ఇక 12 ఏళ్ల తర్వాత స్టోరీ మళ్లీ స్టార్ట్ అవుతుంది. యాన్సీ అనే ఒక స్టార్ హీరోయిన్ హార్ట్ ఎటాక్ తో చనిపోతుంది.

ఆమె సెలబ్రిటీ కావడంతో ఈ న్యూస్ క్షణంలోనే వైరల్ అవుతుంది. అయితే అంతలోనే ఆమెది హత్య అనే విషయం వెలుగులోకి వస్తుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి సిఐ అజీ కురియన్ ను రంగంలోకి దింపుతారు. కేసును విచారించే క్రమంలో బిపిన్ అనే వ్యక్తి వల్లే ఈ మర్డర్ జరిగిందని తెలిసి షాక్ అవుతాడు. ఆ తర్వాత 12 ఏళ్ల క్రితం సారా రాసిన లెటర్ ని వెతుక్కుంటూ మేజిస్ట్రేట్ ను కలిసి విస్తుపోయే నిజాన్ని తెలుసుకుంటాడు. అసలు సారా అమ్మ ఆ లెటర్ లో ఏం రాసింది? సారా కుమారుడు బిపిన్, యాన్సీ మర్డర్ కి సంబంధం ఏంటి? సిఐ అజయ్ ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు? 1000 మందికి పైగా చిన్నారుల కథ ఏంటి అసలు? అనే విషయం తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

విశ్లేషణ

మొదటి ఎపిసోడే బాగా ల్యాగ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఒకటి రెండు ఎపిసోడ్లు పూర్తయితేనే గాని ప్రేక్షకులకు కథ ఏంటో అర్థం కాదు. పైగా డైరెక్టర్ మొదటి 5 ఎపిసోడ్లను 40 నుంచి 50 నిమిషాలకు పైగా నిడివితో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. చాలా చోట్ల స్టోరీ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా సంజీవ్ కథాంశం, దేవన్ ట్రాక్ తో పాటు మరికొన్ని అంశాలు అసలు కథను పక్కకు పెట్టినట్టు అన్పిస్తుంది.  బిపిన్ గురించి తెలుసుకునే ప్రయత్నంలో పరిచయం అయ్యే పాత్రలు, కథలు ఇంట్రెస్టింగ్ గా అనిపించవు.

అయితే మరీ చెప్పుకోవడానికి ఏమీ లేదు అన్నట్టుగా కాకుండా అక్కడక్కడ కాస్త ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. క్లైమాక్స్ ని కాస్త కొత్తగా ఎండ్ చేస్తూ సెకండ్ సీజన్ ఉందని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి డైరెక్టర్ తీసుకున్న ప్లాట్ బాగున్నప్పటికీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఆయన తడబడ్డాడు. ఇక నటీనటులు నీనా గుప్తా, సంజు శివరాం, రెహమాన్ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. శంకర్ శర్మ సంగీతం, ఫైజ్ సిద్ధిక్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్స్.

మొత్తానికి

ఓసారి చూడదగ్గ సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ వెబ్ సిరీస్ ఇది. ఇందులో బోల్డ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడడం ఇబ్బందే.

1000 Babies Web Series Rating : 2.5/5

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×