BigTV English

Tatikonda Rajayya:వాహనం వదిలి పరారయిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య..అందుకేనా?

Tatikonda Rajayya:వాహనం వదిలి పరారయిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య..అందుకేనా?

Ex Mla Tatikonda Rajayya car accident the women ..spot dead
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఆయనని చెప్పుకుంటారు. గతంలో ఆడవారి పట్ల ఆయన ప్రవర్తనపై నెటిజనుల నుంచి చాలా ట్రోలింగులే వచ్చాయి. అప్పట్లో సర్పంచ్ నవ్య రాజయ్య తనని అసభ్యంగా వేధిస్తున్నాడని చేసిన కంప్లయింట్ తో రాజయ్య కెరీర్ కే దెబ్బ పడింది. బీఆర్ఎస్ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా చేసిన తాటికొండ రాజయ్య స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తర్వాత రెండోసారి జరిగిన ఎన్నికలలో రాజయ్య పై వచ్చిన ఆరోపణల ఆధారంగా ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. గతంలో రాజయ్య రాసలీలలపై చాలా ఆరోపణలే వచ్చాయి. అయితే ఈ వివాదాలకు తోడు శనివారం రాత్రి తాటికొండ రాజయ్య ప్రయాణిస్తున్న కారు రోడ్డు దాటుతున్న ఓ మహిళపై దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు స్వప్న(40)గా గుర్తించారు.


నెటిజన్స్ ఆగ్రహం

రక్తమడుగులో రోడ్డుపై పడివున్న ఆమెను కారు దిగి చూసి మళ్లీ వెంటనే రాజయ్య వెళ్లిపోయినట్లు చూసిన కొందరు సాక్షులు చెబుతున్నారు. అయితే కారు నడిపింది రాజయ్యేనా లేక వేరే ఎవరైనా అని పోలీసులు విచారణ చేస్తున్నారు. వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. ఒక రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా బాధ్యతాయుతమైన పదవులు చేసిన రాజయ్య తీరును నెటిజనులు తీవ్రంగా దుయ్యబడుతున్నారు.


కారు నడిపింది ఎవరు?

వరంగల్ జిల్లాకు చెందిన స్వప్న కూలిపని చేసుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటోంది. అయితే శనివారం రాత్రి సమయంలో తన ఇంటి సమీపంలో ఉన్న రహదారి డివైడర్ ను దాటేందుకు ప్రయత్సిస్తుండగా హఠాత్తుగా స్పీడ్ గా వచ్చిన కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కారును బాపూజీ నగర్ లో వదిలేసి అక్కడినుంచి పారిపోయారు. ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు సాక్షులు సోషల్ మీడియాలో వెంటనే పోస్టులు పెట్టారు. ఎమ్మెల్యే రాజయ్యను శిక్షించాలని కోరుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఆ సమయంలో కారును డ్రైవర్ నడుపుతున్నాడని రాజయ్య పర్సనల్ సెక్రటరీ ఫోన్ చేసి చెప్పారని అంటున్నారు. తప్పు తనది కానప్పటికీ ఈ సంఘటనపై మంత్రి స్పందించిన తీరు ఆక్షేపణీయం అని అంటున్నారు అంతా.

Related News

TamilNadu News: పరోటా కోసం వెళ్లి ప్రాణాలే పొగొట్టుకున్నాడు.. అసలేం జరిగిందంటే..?

Hyderabad News: గణేష్ ఉత్సవాలు.. మహిళలతో అసభ్య ప్రవర్తన, మొత్తం 1612 మంది అరెస్ట్

Jogulamba Gadwal: పత్తి చేనులో పిడుగు పడి.. ముగ్గురు మృతి

AP Student Murder: తుపాకీతో కాల్చి.. ఢిల్లీలో చిలకలూరిపేట యువకుడు మృతి

Hyderabad News: డేటింగ్ యాప్ ఉచ్చులో ఆ డాక్టర్‌.. 25 లక్షలు-15 తులాల బంగారం, మేటరేంటి?

Eluru News: ఆడిటర్ అంటూ ఆట ఆడేశాడు.. 2 కిలోల బంగారంతో పరార్, ఫైనాన్స్ కంపెనీలో మోసం

Big Stories

×