E-Paper
Advertisement

Toddler shoots gun: తండ్రి తుపాకీతో ఆడుకుంటూ చనిపోయిన మూడేళ్ల బాలుడు..

Toddler shoots gun: తండ్రి తుపాకీతో ఆడుకుంటూ చనిపోయిన మూడేళ్ల బాలుడు..
Advertisement

Toddler shoots gun: ఇంట్లో తన తండ్రి దాచిపెట్టిన తుపాకీ చూసిన మూడేళ్ల పసివాడు.. దాంతో ఆడుకుంటూ తనను తాను కాల్చుకున్నాడు. పిల్లాడిని కాపాడేందుకు అతని తండ్రి ప్రయత్నించే లోపే ఆ పసి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ హృదయ విదారక ఘటన అమెరికాలోని లూసియానాల రాష్ట్రంలో బుధవారం జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఇంట్లో ఆ పిల్లాడి తండ్రి తన తుపాకీని బెడ్ కింద ఓ బాక్సులో పెట్టాడు. పిల్లాడు ఆడుకుంటూ ఆ బాక్సు తెరిచి చూశాడు. అయితే ఆ గన్‌ని పిల్లాడి తండ్రి లాక్ చేయడం మరిచిపోయాడు. పైగా అందులో బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఆ బరువుగా తుపాకీని పిల్లాడు అటు ఇటు తిప్పుతూ తన ముఖంవైపే గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. అంతే తుపాకీ పేలిన శబ్దం విని.. ఇంట్లో ఉన్న అతని తల్లిదండ్రులు పరిగెత్తు కుంటూ అక్కడికి చేరుకున్నారు.

Advertisement

పిల్లాడిని రక్తపు మడుగులో చూసి సహాయం కోసం 911 ఎమర్జెన్సీకి ఫోన్ చేశారు. కానీ పిల్లాడు స్పాట్ లోనే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పోలీసులు పిల్లాడి తండ్రి నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని కేసు నమోదు చేశారు.

Also Read: యెమెన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. 39 మంది పాలస్తీనియన్లు మృతి

Advertisement

ఇలాంటిదే మరో ఘటన గత నెల అలబామాలో జరిగింది. అప్పుడు కూడా ఓ మూడేళ్ల పిల్లాడు తన తండ్రి కారులో ఉన్న తుపాకీ తీసుకొని ఆడుకుంటూ కాలి వైపు తుపాకీ పెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. పిల్లాడి కాలు ఛిద్రం అయింది. ఆ తరువాత పిల్లాడిని ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు అతని ఆపరేషన్ చేశారు.

లూసియానాలోనే మంగళవారం కూడా ఇలాంటి మరో ఘటన జరిగింది. 15 ఏళ్ల ఓ అమ్మాయిని తన బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఓ వ్యక్తి పొరపాటున తుపాకీ ట్రిగ్గర్ నొక్కాడు. అంతే ఆ తుపాకీ బుల్లెట్ ఎదురుగా ఉన్న అమ్మాయికి తగిలింది. అమ్మాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.

తుపాకీ ప్రమాదాలు అమెరికా తరుచూ జరుగుతూనే ఉన్నాయి. ఈ తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా కొంత మంది పోరాడినా.. అక్కడ రాజ్యంగం ప్రకారం…ప్రతి ఒక్కరూ తుపాకీ కలిగి ఉండే హక్కు ఉంది.ఈ నియమం వల్ల అమెరికాలో ప్రతి ఇంట్లో తుపాకులుంటాయి. దీని వల్ల జరిగే ప్రమాదాల దృష్ట్యా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకువచ్చినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

గత మే నెలలో ఓ నాలుగేళ్ల బాలుడు.. మిషిగాన్ లో ఇంట్లో తుపాకీతో ఆడుకుంటూ తలలో కాల్చుకున్నాడు. అంతే వెంటనే అతను చనిపోయాడు. పిల్లాడి తండ్రి, మరో ముగ్గురిని తుపాకీ నిర్లక్ష్యం కేసులో పోలీసులు అరెస్టు చేశారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×