Road Accident: అతి వేగం ఐదుగురు ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారు. ఘటన గురించి సమాచారం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే మృతులు ఎక్కడివారు అనేదానిపై ఆరా తీస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వస్తున్న కారు, అదుపు తప్పి బలంగా లారీని ఢీ కొట్టింది. చిత్తూరు-బెంగుళూరు జాతీయ రహదారిపై పలమనేరులోని వైఎస్సార్ జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు స్పాట్‌లో మృత్యువాతపడ్డారు. చనిపోయినవారిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
ప్రమాదానికి గురైన కారు బెంగుళూరు నుంచి చిత్తూరు వైపు వస్తోంది. పలమనేరు వైఎస్సార్ జంక్షన్ వద్దకు వచ్చిన తర్వాత కర్నూలు వెళ్తున్న సిమెంట్ లారీనివెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. లారీ కిందకు కారు దూసుకెళ్లింది. ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
లారీని ఢీ కొట్టిన కారు, స్పాట్ లో ఐదుగురు మృతి
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, అతి కష్టం మీద లారీ నుంచి కారు వేరు చేశారు. అప్పటికే కారులోని వారంతా నుజ్జునుజ్జు అయ్యారు. మృతులు ఏ ప్రాంతానికి చెందినవారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. కారులోని ఏ ప్రాంతానికి చెందినవారు? ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్తున్నారు అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.
పోలీసులు మాత్రం బెంగుళూరు నుంచి చిత్తూరు వస్తున్న కారు ప్రమాదానికి గురైనట్టు ప్రాధమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు నెంబర్ ఆధారంగా వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు నుంచి ఎగిరిపడ్డ ప్రయాణికులు
BIG TV EXCLUSIVE
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి.. సీసీ ఫుటేజ్
చిత్తూరు జిల్లా గంగవరం మండలం వైఎస్సార్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
బెంగుళూరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారు
సిమెంట్ లారీని వెనుక వైపు నుంచి ఢీకొన్న కారు
పలమనేరు వద్ద సిమెంట్ లోడ్ వదిలేసి కర్నూలు వైపు… pic.twitter.com/4767KzNMSK
— BIG TV Breaking News (@bigtvtelugu) March 4, 2026