BigTV English

Father Kills Daughter : అనుమానంతో ఆరేళ్ల కూతుర్ని చంపిన తండ్రి.. మిస్సింగ్ కేసు పెట్టి డ్రామా

Father Kills Daughter : అనుమానంతో ఆరేళ్ల కూతుర్ని చంపిన తండ్రి.. మిస్సింగ్ కేసు పెట్టి డ్రామా

Father Killed Daughter in Narpala : ఆడపిల్లలకు ఇంటి బయటే కాదు. సొంతింట్లోనూ రక్షణ ఉండటం లేదు. అన్నదమ్ములు, బాబాయ్, తాతయ్య, మామయ్య.. ఇలా ఇంట్లో అంతా అయినవారే ఉన్నా.. ఎందుకో ఆడపిల్లలకు రక్షణ కరువవుతోంది. కామంతో కొందరు కాటేస్తుంటే.. భార్యలపై అనుమానాలతో పిల్లల్ని పొట్టనబెట్టుకుంటున్నారు ఇంకొందరు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. కూతురికి ఏ కష్టమొచ్చినా.. నేనున్నా అని ధైర్యం చెప్పాల్సిన తండ్రే.. ఆ చిన్నారి పాలిట యముడయ్యాడు.


నిండు నూరేళ్లు ఏ ఆపద రాకుండా చూసుకుంటాడనుకున్న తండ్రే..ఆ కూతురి పాలిట మృత్యువుగా మారాడు. ఆ పసి జీవితాన్ని ఆదిలోనే అంతం చేశాడు. అనంతపురం జిల్లా నార్పలలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆరేళ్ల బాలిక పావనిని దారుణంగా హత్య చేసి.. బావిలో పడేసాడు తండ్రి గణేష్. ఆ తర్వాత కూతురు కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ నెల 20వ తేదీ సాయంత్రం నుంచి కూతురు కనిపించడం లేదని నార్పల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు రంగంలోకి దిగి గాలించారు. ఎక్కడా పాప ఆచూకీ లభించలేదు.

Also Read : దారుణానికి ఒడిగట్టిన కసాయి తండ్రి..


చివరికి తమదైన శైలిలో విచారణ చేయగా కన్నతండ్రే పాపను హత్య చేసి బావిలో పడేసినట్లు తేల్చారు. బావిలో నుంచి బాలిక మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. చిన్నారి హత్య విషయం తెలుసుకున్న స్థానికులు బావి వద్దకు చేరుకున్నారు తల్లి బంధువులు. చిన్నారి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారిని కన్న తండ్రి పొట్టనపెట్టుకున్నాడంటూ వాపోయారు.

కాగా.. భార్యపై అనుమానంతోనే గణేష్ తన కూతురిని చంపినట్లుగా పోలీసులు తెలిపారు. తన భార్యపై అనుమానంతోనే కూతురి గొంతు నులిమి చంపి.. బావిలో పడేసినట్లు అతను పోలీసుల విచారణలో అంగీకరించాడు. గణేష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు.

Tags

Related News

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Kerala Crime: గదిలో లాక్ చేసి.. మతం మారాలంటూ ప్రియురాలిని వేధించిన ప్రియుడు.. ప్రాణాలు విడిచిన యువతి

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Kukatpally News: ఎంత పని చేశావ్ దేవుడా..? షటిల్ ఆడుతుండగా కరెంట్ షాక్.. క్షణాల్లో బాలుడు మృతి

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Big Stories

×