Gachibowli Racket Busted: హైదరాబాద్ సిటీలోని గచ్చిబౌలి ప్రాంతంలో భారీ హైటెక్ వ్యభిచారం రాకెట్‌ను గుట్టు రట్టు చేశారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. గౌలిదొడ్డి ఏరియాలోని టీఎన్‌జీఓఎస్ కాలనీలో ఫారిన్ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు ఓ కంత్రిగాడు. మూడో కంటికి తెలీకుండా జాగ్రత్త నడుపుతూ వస్తున్నాడు.
ఆ ప్రాంతానికి తరచూ ఫారెన్ గాళ్స్ రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. కొద్దిరోజులు స్థానికులు నిఘా పెట్టారు. ఆపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం రాత్రి వ్యభిచార గృహంపై మాదాపూర్ ఎస్ఓటీ, హెచ్‌టీఎఫ్ అధికారుల దాడులు చేశారు. అమ్మాయిలతోపాటు అబ్బాయిలను అరెస్ట్ చేశారు.
అరెస్టయిన వారిలో 9 మంది విదేశీ మహిళలున్నారు. కెన్యా, టాంజానియా, బ్యాంకాక్ దేశాలకు చెందిన యువతులుగా గుర్తించారు. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు నిర్వాహకులు. సోదాల విషయం తెలియగానే నిర్వాహకుడి అక్కడి నుంచి పారిపోయినట్టు సమాచారం. అతడి కోసం వేట ముమ్మరం చేశారు మాదాపూర్ ఎస్ఓటీ టీమ్. దీని గురించి మరింత సమాచారం అందాల్సివుంది.