జిబీఎస్.. గులియన్ బారే సిండ్రోమ్. ఇది మహారాష్ట్రను వణికించేస్తోంది. పూణే, షోలాపూర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువ మంది దీని బారిన పడ్డారు. వీరంతా ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి కారణంగా 16 మంది వెంటిలేటర్ పైన చికిత్స పొందడం ఆరోగ్యశాఖలో కలవరపెడుతోంది. కాకపోతే ఇది అంటువ్యాధి కాదు. కాబట్టి త్వరగా ఒకరి నుంచి ఒకరికి సోకడం లేదు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధిగావైద్యులు చెబుతున్నారు
మహారాష్ట్రలో ఎక్కడైతే జిబిఎస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందో… అక్కడ పాతిక వేలకు పైగా ఇళ్లను సర్వే చేసారు వైద్యారోగ్య శాఖ అధికారులు. ఎంత మంది రోగులు జిబిఎస్ బారిన పడ్డారో తెలుసుకున్నారు. దీనికి చికిత్స చేయడం కూడా కష్టమే. ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒక్కో వ్యాక్సిన్ ధర 20వేల రూపాయల పైనే ఉంటుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారిపైనే ఈ జిబిఎస్ వ్యాధి విరుచుకుపడుతున్నట్టు తెలుస్తోంది.
ఏంటీ ఈ జిబీఎస్?
జిబిఎస్ అనేది ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ గా కూడా చెప్పుకోవచ్చు. ఇది శరీరంలోని కొన్ని భాగాలకు సంకేతాలను పంపే నరాలపైనే దాడి చేస్తోంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి నేరుగా నరాలపై దాడి చేయడం. దీని వల్ల రోగి బలహీనంగా మారి నరాలు సమస్యలు వస్తాయి. అందుకే ఈ వ్యాధిని ఆటో ఇమ్యూన్ వ్యాధిగా కూడా పిలుచుకుంటారు.
ఎంత ఖర్చు?
జిబిఎస్ సోకిన వ్యక్తికి ఖరీదైన చికిత్సను అందించాలి. ఇమ్యూనోగ్లోబిన్ అని పిలిచే ఇంజెక్షన్ వేయాలి. ఆ ఇంజెక్షన్ విలువ 20 వేల రూపాయలకు పైగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారికి దాదాపు 13 ఇంజక్షన్లు కోర్సును ఇవ్వాల్సి వస్తుంది. ఒక్క ఇంజక్షన్ 20000 రూపాయలు… అంటే 13 ఇంజక్షన్లు కొనాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ వ్యాధికి ఉచిత చికిత్స అందిస్తున్నట్టు ప్రకటించింది.
కలుషిత ఆహారం, నీటి ద్వారా కూడా ఈ బ్యాక్టీరియా సోకి అవకాశం ఉంది. ఈ బ్యాక్టీరియా సోకిన తర్వాత ఆ వ్యక్తుల్లో పొత్తికడుపు దగ్గర నొప్పిగా అనిపిస్తుంది. జ్వరం, వాంతులు, డయేరియా వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించడం కూడా తప్పుగా జరుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల రోగనిరోధక వ్యవస్థ సొంత నరాలపైన దాడి చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల సమస్య తీవ్రంగా మారిపోతుంది.
అయితే సరైన చికిత్సతో ఈ వ్యాధిని నయం చేసుకోవచ్చు. అలాగే వదిలేస్తే మాత్రం ప్రాణాంతకంగా మారుతుంది. ఈ జీబీఎస్ బారిన పడిన తర్వాత తిరిగి సాధారణంగా నడవడానికి కొన్ని రోజులు లేదా నెలలు పట్టే అవకాశం ఉంది. కొంతమందికి ఏడాది దాటి కూడా సమయం పట్టవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కలుషిత నీరు, ఆహారం తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.
గులియన్ బారే సిండ్రోమ్ ను పక్షవాతంగా కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ వ్యాధి సోకితే కండరాలు చచ్చుబడినట్టు అయిపోతాయి. ఏ పనీ చేయలేరు. చేతులు, కాళ్ళను కదల్చలేరు. అందుకే జిబిఎస్ బారిన పడితే కొన్ని రోజులపాటు పక్షవాతంతో ఇబ్బంది పడినట్టే అనిపిస్తుంది.
Also Read: తరచూ ఆరోగ్య సమస్యలా ? జాగ్రత్త, మీకు ఈ రిస్క్ ఎక్కువట !
జీబీఎస్ లక్షణాలు
చేతి వేళ్ళు, మణికట్టు, కాళ్ళ మడమల వద్ద సూదులు పొడుస్తున్నట్టు అనిపిస్తుంటే మీరు తేలికగా తీసుకోకండి. ఇది జిబిఎస్ లక్షణం కావచ్చు. అలాగే విపరీతమైన కాళ్ల నొప్పులు, కాళ్లల్లో బలహీనంగా అనిపించడం, మెట్లు ఎక్కలేకపోవడం, సరిగా నడవలేకపోవడం, మాట్లాడలేకపోవడం, ఆహారం మింగలేక పోవడం, నమలలేకపోవడం వంటివన్నీ కూడా ఈ జిబిఎస్ లక్షణాలుగా చెప్పుకోవాలి. అలాగే దృష్టి లోపం కూడా కనిపిస్తుంది. ఎదురుగా చూస్తున్న దృశ్యం రెండుగా విభజించినట్టు కనిపిస్తుంది. అలాగే శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. రక్త పోటులో హెచ్చుతగ్గులు ఉంటాయి. గుండె వేగం కూడా అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఇవన్నీ కూడా జిబిఎస్ లక్షణాలే. మీలో ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.