Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఒకప్పుడు వరుస సినిమాలతో క్రేజ్ ను సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలు రికార్డులను బ్రేక్ చేశాయి. అలాగే కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆయన కెరియర్ లో ఖుషి మూవీ తో రికార్డులు బద్దలు కొట్టిన పవర్ స్టార్ తర్వాత ఐదు సినిమాలతో బోల్తా పడ్డారు.. అయినా వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.. హిట్ రాదు అనుకున్న సమయంలో విడుదలైన జల్సా మూవీ సూపర్ హిట్ అయి రికార్డులు క్రియేట్ చేసింది.. సినీ లైఫ్ టర్న్ చేసింది ఈ సినిమాని చెప్పాలి. మరి ఈ సినిమాకు ఎన్ని రికార్డులు, అవార్డులు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పవన్ కళ్యాణ్ సినిమాలు..
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తన టాలెంట్ తో ఒక్కో హిట్ సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ తక్కువ కాలంలోనే పవర్ స్టార్ అయ్యారు. ఆయన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కో సినిమాలో ఒక్క విధంగా కనిపించి పవన్ కళ్యాణ్ తన అభిమానులను ఆకట్టుకున్నాడు.. ట్రెండ్ ఫాలో అవ్వని పవన్ కళ్యాణ్ సరికొత్త ట్రెండ్ ని సెట్ చేస్తూ యూత్ కి ఐకాన్ లా మారాడు. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాలు అన్నా పవన్ కళ్యాణ్ అన్న యూత్ కి పిచ్చి.. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు నటిచ్చిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయనిచెప్పలేం.. కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటుగా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తే.. మరికొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యాయి.. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో జల్సా ఒకటి. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు.. ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిందని అతి కొద్ది మందికే తెలుసు… ఆ రికార్డు లు ఏంటో ఒకసారి చూద్దాం..
జల్సా మూవీ అందుకున్న అరుదైన రికార్డులు..
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంది. ఒక కుర్రాడు తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను గురించి చిన్న కథ లాగా చెప్పే సినిమాకు దేవిశ్రీ సంగీతం అందించడంతో మరింత ఊపు వచ్చింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీగా జల్సా నిలిచింది. ఈ సినిమా పోస్టర్ సరికొత్త రికార్డుని ట్రైన్ సెట్ చేసుకుంది. సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా నుంచి మూడు పాటలు లీక్ అయ్యాయి. ఆ పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో అటు దేవిశ్రీకి ఇటు పవన్ కళ్యాణ్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. జల్సా సినిమా ఆడియో సీడీల ద్వారానే కోటి రూపాయలు సంపాదించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.. నైజాంలో 9.10 కోట్ల షేర్ వసూలు చేసిన మొదటి చిత్రంగా నిలిచింది. అలాగా సింగర్ బాబా సెహగల్ ను ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ మూవీలో కోట్లు రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన సెట్లో సాంగ్ని చిత్రీకరించారు. అలాగే పవర్ స్టార్ సినిమాకు సూపర్ స్టార్ వాయిస్ ఇవ్వడం మరో రికార్డ్ అని చెప్పాలి. ఇదే జల్సా మూవీ అందుకున్న రికార్డులు..