E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బీఎండబ్ల్యూ బైక్ అదుపుతప్పి యువకుడు మృతి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బీఎండబ్ల్యూ బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Advertisement

Road Accident: రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డుపై రక్తపు మరక ఆరక ముందే మరో ఘోరం సంభవిస్తోంది. అధికారులు ఎన్ని ప్రచారాలు చేస్తున్నా.. ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రాణాల కంటే వేగమే ముఖ్యమనుకునే కొందరి నిర్లక్ష్యం, మరికొందరి పాలిట శాపంగా మారుతోంది.

కేవలం నిమిషాల వ్యవధిని ఆదా చేయాలనే ఆరాటం, జీవితకాల విషాదాన్ని మిగులుస్తోంది. తాజాగా ఓ ఘటన అతివేగం అనేది ఎంతటి ప్రమాదాన్ని తెస్తుందో మనకు మరోసారి స్పష్టం చేస్తోంది.

Advertisement

నల్గొండ జిల్లా చిట్యాల శివారులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి సుమారు 30 మంది బైక్ రైడర్లతో కలిసి బాపట్ల బీచ్‌కు రైడింగ్‌కు వెళ్లిన రితీష్ రెడ్డి అనే యువకుడు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యాడు. బాపట్ల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో అతివేగంతో ప్రయాణిస్తుండగా బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టినట్లు సమాచారం. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో రితీష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

సుమారు 25 లక్షల రూపాయల విలువ చేసే బీఎండబ్ల్యూ రేసింగ్ బైక్‌పై ఆయన ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. మృతుడు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన యువకుడిగా గుర్తించారు. ఘటన అనంతరం స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతివేగం , నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Also Read: మహాశివరాత్రి వేళ మారణహోమం.. ఆటోలో వచ్చి అడ్డగించి.. కర్రలతో కొట్టి..!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×