E-Paper
Advertisement

Honor killing: పరువు హత్య.. ప్రియుడి డెడ్‌బాడీతో యువతి పెళ్లి, షాకైన పేరెంట్స్, నిందితులు అరెస్ట్

Honor killing: పరువు హత్య.. ప్రియుడి డెడ్‌బాడీతో యువతి పెళ్లి, షాకైన పేరెంట్స్, నిందితులు అరెస్ట్
Advertisement

Honor killing: టెక్ యుగంలోనూ అనేక ఘోరాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. లవ్ వ్యవహారం ఓ ప్రియుడు ప్రాణం తీసింది. అయినా వెనక్కి తగ్గలేదు ఆ యువతి. తన ప్రియుడి మృతదేహంతో పెళ్లి చేసుకున్న ఘటన కలకలం రేగింది. ఈ ఘటన నాందేడ్‌లో వెలుగుచూసింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..

మహారాష్ట్ర నాందేడ్‌ ప్రాంతంలో 18 ఏళ్ల యువతి.. 25 ఏళ్ల యువకుడ్ని ప్రేమించింది. వీరిద్దరు లవ్‌లో చాలా డీప్ అయ్యారు. ఈ విషయం అమ్మాయి బంధువులకు తెలిసింది. వారు పేరెంట్స్ చెవిలో ఊదారు. దీంతో కూతుర్ని హెచ్చరించారు. అయినా ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు ఆ యువతి. తమ పరువు తీస్తుందని భావించి, ఆ యువకుడ్ని నరికి చంపేశారు యువతి తండ్రి, అన్నయ్య.

Advertisement

కేవలం తాను ప్రేమించిన పాపానికి తన ప్రియుడ్ని పొట్టన పెట్టుకున్నారని కన్నీరు మున్నీరు అయ్యింది యువతి. ప్రియుడి లేని లోకంలో తాను ఉండలేనని భావించింది. తండ్రి చేసిన ఈ పనిని ప్రపంచానికి తెలియజేయాలని భావించింది ఆ యువతి. తన ప్రియుడి మృతదేహంతో తాళి కట్టించుకుంది. ఈ ఘటనలో నాందేడ్ వాసులు షాకయ్యారు.

నాందేడ్‌లోని జునగంజ్‌కు చెందిన ఇద్దరు యువతీయువకులు ప్రేమించుకున్నారు. తమ ప్రేమను జీవిత బంధంగా మార్చుకోవాలని భావించారు. అయితే ఇద్దరిది వేర్వేరు కులాలు కావడంతో యువతి తల్లిదండ్రులు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవడానికి యువతీ యువకులు రెడీ అవుతున్నారు. ఈ విషయంలో కూతుర్ని కన్వీన్స్ చేసే ప్రయత్నం చేశారు.

Advertisement

కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వారి మాట వినలేదు. గురువారం సాయంత్రం జునా గంజ్ ప్రాంతానికి యువకుడ్ని పిలిపించారు. అప్పటికే అక్కడికి యువతి సోదరులు హిమేష్, సాహిల్ మామిల్వాడ్, ఆమె తండ్రి గజానన్ మామిల్వాడ్ ఉన్నారు. యువతి ప్రియుడి అక్కడికి రాగానే దారుణంగా హత్య చేశారు. అతడి తలపై రాతి పలకతో కొట్టి చంపేశారు.

సంఘటనతో షాకైంది ఆ యువతి. తన ప్రేమికుడి ఇంటికి వెళ్లింది. ప్రియుడి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ప్రియుడు చనిపోయి గెలిచాడని ఏడుస్తూ.. నుదుడిపై కుంకుమ ధరించి డెడ్‌బాడీతో తన మెడలో తాళి కట్టించుకుంది. దీంతో ఆ ప్రాంతమంతా ప్రజలు ఒక్కసారిగా షాకయ్యారు.

యువకుడి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించిన తండ్రి- సోదరులు ఓడిపోయారని, మా ప్రేమ గెలిచిందని ఆ యువతి కన్నీరుమున్నీరు అయ్యింది. తన తండ్రి, సోదరులను ఉరితీయాలని కోరింది.

తన కుటుంబంతో అన్ని సంబంధాలను తెంచుకున్నానని, తన ప్రియుడి ఇంట్లోనే ఉంటానని తేల్చి చెప్పింది. వాళ్ల నుంచి తనను ఎవరూ విడదీయలేరని తేల్చిచెప్పింది. ఈ ఘటన తర్వాత ఎలాంటి ఉద్రిక్తతలను తలెత్తకుండా ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×