E-Paper
Advertisement

Road Accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బీభత్సం.. స్పాట్‌లో ముగ్గురు మృతి

Road Accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బీభత్సం.. స్పాట్‌లో ముగ్గురు మృతి
Advertisement

Road Accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో జాతీయ రహదారి రక్తసిక్తమైంది. వేగంగా వస్తున్న లారీ, మరొక వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బైక్‌ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అటు ఆటోని ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

జగిత్యాల జిల్లాలో జాతీయ రహదారిపై  ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

అతివేగం ప్రమాదకరం.. పదేపదే పోలీసులు చెబుతున్నా వాహనదారులు ఏ మాత్రం లెక్కచేయలేదు. ఫలితంగా అనుకోని రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.  బుధవారం అర్ధరాత్రి జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని జాతీయ రహదారిపై అలాంటి ఘటన జరిగింది.

ధర్మపురి జాతీయ రహదారిపై ఓ లారీ మరో వాహనాన్ని ఓవర్‌ టేక్ చేయబోయింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. అంతేకాదు పక్కన వెళ్తున్న ఆటోని అతివేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికి అక్కడే మృతి చెందారు. మృతుల సొంతూరు ధర్మపురి పట్టణానికి చెందినవారు.

Advertisement

లారీ బీభత్సం.. బైక్-ఆటోని ఢీ, స్పాట్‌లో ముగ్గురు మృతి

అటు ఆటో కూడా బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నారు పోలీసులు. బాధితులను అంబులెన్సులో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినవారు అమర్‌నాథ్, రిశ్వంత్‌లుగా గుర్తించారు.

మరొకరు జగిత్యాలకు చెందిన మయన్ అని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఘటన జరిగిన ప్రాంతం నుంచి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఆటోని ప్రయాణికులు హనుమాన్ జయంతి సందర్భంగా స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ALSO READ:  ప్రేమ విఫలమైందని ర్యాపిడో డ్రైవర్ ఆత్మహత్య!

 

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×