Vijayawada News: సంసారానికి కొడుకు పనికి రాడని తల్లిదండ్రులకు తెలుసు. వివాహం తర్వాత ఆ సమస్య సర్దుకుటుందని భావించి వివాహం చేశారు. అయినా కొడుకులో ఎలాంటి మార్పు రాలేదు. గంపెడు ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టిన ఆ యువతి ఆశలు ఆవిరైపోయాయి. రాత్రి వేళ భర్త ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి ప్రశ్నించింది. ఫలితంగా అసలు విషయం తెలిసి షాకైంది. సంచలనం రేపిన ఈ ఘటన విజయవాడలో వెలుగుచూసింది.
విజయవాడలో షాకింగ్ ఘటన.. భర్త, అత్తమామలపై కేసు
నంద్యాలకు చెందిన ఓ యువతి పంచాయతీ సెక్రటరీగా పని చేస్తోంది. గతేడాది డిసెంబరు 26న కడప జిల్లాకు చెందిన ఓ యువకుడితో ఆ యువతికి వివాహం జరిగింది. వరుడు విజయవాడలో ప్లానింగ్ సెక్రటరీగా పని చేస్తున్నాడు. వివాహం మయంలో పెళ్లికి ముందు ఇవ్వాల్సిన లాంఛనాలు అల్లుడికి పెట్టారు అత్తింటివారు.
15 లక్షల కట్నం, దుస్తుల కోసం మరో లక్ష రూపాయాలు ఇచ్చారు. అంతేకాదు వివాహం రోజున ఐదు తులాల బంగారు ఇచ్చారు. వివాహం కూడా ఘనంగా జరిగింది. ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమంలో అసలు చిచ్చు రేగింది. ఫలితంగా రిసెప్షన్ రోజు పెళ్లికొడుకు..అత్తింటి వారితో గొడవపడ్డాడు. ఆ తర్వాత ఇక అత్తింటికి అల్లుడు వెళ్లడం మానేశాడు.
పెళ్లై మూడు నెలలైనా భార్యకు దూరంగా, నిలదీస్తే షాకింగ్ విషయాలు
ఉద్యోగం నిమిత్తం విజయవాడ వచ్చేశాడు. మొదట జరగాల్సిన మూడు రాత్రిళ్లు కూడా అలా వాయిదా పడుతూ వచ్చింది. విజయవాడ వెళ్లిన తర్వాత కూడా భర్త ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. దాదాపు మూడు నెలలపాటు వధువు ఓపిక పట్టింది. రాత్రిళ్లు ఇంటికి రాకుండా భార్యతో సంసారం చేయకుండా ముఖం చాటేయడం మొదలుపెట్టాడు.
చివరకు భర్తని భార్య నిలిదీసింది. తల్లిదండ్రులకు సేవ చేసేందుకే వివాహం చేసుకున్నట్లు చెప్పడంతో భార్య ఒక్కసారిగా షాకైంది. చాలాసేపటి వరకు ఆమె నోటి వెంట మాట రాలేదు. అక్కడి నుంచి భార్యను గవర్నర్‌పేటలోని సోదరుడి ఇంట్లో దించి వెళ్లిపోయాడు ఆమె భర్త. సంసారానికి పనికి రాడని నపుంసకుడని తెలిసి వివాహం చేశారని వధువు తెలుసుకుంది.
ALSO READ: వెయ్యి రూపాయల కోసం ఓ వ్యక్తి దారుణ హత్య..!
ఈ విషయం యువతి.. తన కుటుంబసభ్యులకు తెలిపింది. పెద్దల సమక్షంలో భర్త, అత్తమామలు, మధ్యవర్తిని యువతి కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీశారు. దీంతో వరుడు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ వారిని బెదిరించడం మొదలుపెట్టారు. చివరకు ఇంట్లో నుంచి బయటకు నెట్టేశారు. దీనికి పోలీసులు పరిష్కారం చూపుతారని భావించిన యువతి కుటుంబసభ్యులు గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైన జరిగిన విషయాలు బయటపెట్టారు. ఈ వ్యవహారంపై భర్త, అతడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.