E-Paper
Advertisement

Matrimonial Crime: కాంబోడియాలో ట్రైనింగ్.. పెళ్లికాని వారికి వల.. వీడు యమా డేంజర్!

Matrimonial Crime: కాంబోడియాలో ట్రైనింగ్.. పెళ్లికాని వారికి వల.. వీడు యమా డేంజర్!
Advertisement

Matrimonial Crime: మ్యాట్రిమోనియల్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు తెలిపిన ప్రకారం.. విశాఖపట్టణానికి చెందిన పెదపూడి ప్రసన్న కుమార్​ (32).. 2024లో ఓ జాబ్ కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగం కోసం కాంబోడియాకు వెళ్లాడు. అక్కడ సోషల్ మీడియా ద్వారా భారతీయులను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్న కొన్ని గ్యాంగ్ లీడర్లతో అతనికి పరిచయాలు ఏర్పడ్డాయి.

ఈ క్రమంలో ఓ ముఠాలో చేరిన ప్రసన్న కుమార్ క్రిప్టో కరెన్సీ ప్లాట్ ఫాంల పేరుతో ఎలా మోసాలు చేయాలో నేర్చుకున్నాడు. ఆ తరువాత విశాఖపట్టణానికి తిరిగి వచ్చాడు. రవికిరణ్​, గంగరాజుల సహాయంతో దాదాపు 500 సిమ్ కార్డులు సేకరించాడు. వీటి ద్వారా మ్యాట్రిమోనియల్, సోషల్ మీడియాలో పదుల సంఖ్యలో నకిలీ ప్రొఫైల్స్ అప్​ లోడ్ చేశాడు.

Advertisement

మహిళ పేరుతో వివాహం కానివారిని ఉచ్ఛులోకి లాగి మోసాలకు తెర లేపాడు. ఇలాగే హైదరాబాద్ కు చెందిన 28 ఏళ్ల యువకునికి అంజలి కందుల పేరుతో షాదీ డాట్ కామ్​ ద్వారా మెసేజ్ పంపించాడు. ఆ తరువాత గొంతు మార్చి వాట్సాప్ కాల్స్ మాట్లాడుతూ నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉందని తీయని మాటలతో కొన్నిరోజుల్లోనే సన్నిహితుడయ్యాడు. తాను యూకేలో ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పాడు.

బాధితుడు తనను పూర్తిగా నమ్మాడని నిర్ధారించుకున్న తరువాత తన బాబాయ్ ట్రేడింగ్ లో ఎక్స్ పర్ట్ అని నమ్మించి 11లక్షల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టించాడు. దానిపై లాభాలు వచ్చినట్టు చూపించాడు. అయితే, బాధితుడు నగదు విత్ డ్రా చేయటానికి ప్రయత్నించగా సాధ్యపడలేదు. దీని గురించి ప్రశ్నిస్తే మరింత డబ్బు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుందని చెప్పాడు.

Advertisement

Also Read: Pending Bills: ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. పెండింగ్ బిల్లులు విడుదల

దాంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు.. తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. పక్కా ప్లాన్ ప్రకారం ప్రసన్న కుమార్ ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు సైతం పంపారు.

Also Read: Jio vs Airtel vs VI: అపరిమిత కాల్స్, 5G డేటా.. ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు.. క్రేజీ ప్లాన్స్ భయ్యా!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×