E-Paper
Advertisement

Rukmini: ‘రుక్మిణి’కి మంచు మనోజ్ సపోర్ట్.. ఏం చేశారంటే?

Rukmini: ‘రుక్మిణి’కి మంచు మనోజ్ సపోర్ట్.. ఏం చేశారంటే?
Advertisement

Rukmini: నిరంజన్, గ్రీష్మ నేత్రికా, ప్రియ జస్పర్, దీప్తి శ్రీరంగం హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘రుక్మిణి’ (Rukmini) చిత్రానికి రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) సపోర్ట్ అందించారు. సరికొత్త హారర్ కామెడీ కథతో దర్శకుడు సింహాచలం గుడుపూరి ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా, జి సినిమా బ్యానర్ పై నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్నారు. శ్రీమతి నేలబల్లి కుమారి సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్ర టీజర్‌ని శుక్రవారం మంచు మనోజ్ ఆవిష్కరించి, యూనిట్‌‌కు శుభాకాంక్షలు తెలిపారు. టీజర్ విడుదల అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ.. ‘రుక్మిణి’ సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ సినిమాతో నిరంజన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా అతనికి, టీమ్ అందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. టీజర్ చూస్తుంటే డైరెక్షన్, డీవోపీ వర్క్, మ్యూజిక్ అన్నీ అద్భుతంగా కుదిరినట్లుగా అనిపిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ.. టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ తెలియజేస్తున్నానని అన్నారు.

Also Read- The Kerala Story 2: ది కేరళ స్టోరీ 2 పై హైకోర్టు కీలక తీర్పు..‌ సినిమా విడుదల ఉందా.. లేదా.. అంటే..!

త్వరలోనే విడుదల

Advertisement

అనంతరం డైరెక్టర్ సింహాచలం గుడుపూరి మాట్లాడుతూ.. కొత్త వారిని ఎంకరేజ్ చేయడంలో మంచు మనోజ్ ఎప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపించారు. మా మూవీ టీజర్ రిలీజ్ చేసి సపోర్ట్ చేసినందుకు ఆయనకు మా టీమ్ అందరి తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సినిమాతో హీరోగా నిరంజన్‌కు చాలా మంచి పేరు వస్తుంది. మా మూవీ ఇంత బాగా వచ్చిందంటే కారణం మా నిర్మాతలు. వారు ఎంతో ప్యాషనేట్‌గా, ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాకు సహకరించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు. నిర్మాతలలో ఒకరైన కట్టా గంగాధర్ రావు మాట్లాడుతూ.. మా ‘రుక్మిణి’ మూవీ టీజర్‌ను మంచు మనోజ్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. మోహన్ బాబు సినిమాలకు అప్రెంటిస్‌గా వర్క్ చేయడంతోనే నా కెరీర్ మొదలైంది. ఇప్పుడా ఇంటి హీరో మా సినిమాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. ఈ మూవీని దర్శకుడు సింహాచలం చాలా బాగా తెరకెక్కిస్తున్నారు. సాంకేతికంగా కూడా సినిమా గొప్పగా ఉంటుంది. త్వరలోనే థియేటర్లలోకి తీసుకొస్తామని తెలిపారు.

Also Read- Mrithyunjay: శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’ ట్రైలర్ రిలీజ్ చేసే స్టార్ హీరో ఎవరో తెలుసా?

డిఫరెంట్ హారర్ కామెడీ ఫిల్మ్

Advertisement

ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్యూ.. ఒక డిఫరెంట్ హారర్ కామెడీ మూవీగా రానున్న ‘రుక్మిణి’ అందరినీ అలరిస్తుందని హీరో నిరంజన్ అన్నారు. హీరోయిన్లు గ్రీష్మ నేత్రికా, ప్రియా జాస్పర్‌లు తమకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రేక్షకులు ఈ సినిమాకు సపోర్ట్ చేయాలని కోరారు. ఇంకా సినిమాకు సంబంధించిన పలువురు ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. సినిమా మంచి విజయం సాధించి, అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రస్తుతం ఈ చిత్ర టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read- Hero Vijay Divorce: విజయ్‌కు భార్య షాక్.. పెళ్లయిన 26 ఏళ్లకు విడాకులు, ఆ రూమర్లే కారణమా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×