E-Paper
Advertisement

కారు, వాటర్ ట్యాంకర్ ఢీ.. స్పాట్ లో తండ్రి, కొడుకు

కారు, వాటర్ ట్యాంకర్ ఢీ.. స్పాట్ లో తండ్రి, కొడుకు
Advertisement

ORR Accident: ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఘోర రోడ్డు ప్రమాదం ఒక నిండు కుటుంబాన్ని చిదిమేసింది. చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో తండ్రి, రెండున్నరేళ్ల కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

హన్మకొండ జిల్లా కేంద్రానికి చెందిన కాటంగూరి వేద ప్రకాష్ రెడ్డి (37) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం హన్మకొండలో జరిగిన దేవుడి పండగకు హాజరయ్యేందుకు ఆయన తన కుటుంబంతో కలిసి ఊరికి వచ్చారు. వేడుక ముగిశాక, మంగళవారం తిరిగి బెంగళూరుకు ప్రయాణమయ్యారు. కారులో వేద ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన భార్య హిమబిందు, కుమారుడు అర్జున్, కజిన్ దుర్గాప్రసాద్ రెడ్డి, ఆయన భార్య శ్రీజ ఉన్నారు.

Advertisement

కారు ఘట్‌కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు పైకి చేరింది. పెద్ద అంబర్‌పేట్ సమీపానికి రాగానే, అక్కడ రోడ్డు పక్కన ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను వేద ప్రకాష్ నడుపుతున్న కారు బలంగా ఢీకొట్టింది. కారు వేగంగా ఉండటంతో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది.

ఈ భీకర ప్రమాదంలో వేద ప్రకాష్ రెడ్డి , ఆయన చిన్నారి కుమారుడు అర్జున్ తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే మరణించారు. కారులో ఉన్న మిగిలిన హిమబిందు, దుర్గాప్రసాద్, శ్రీజలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: రేవంత్ రెడ్డి ఫార్ములానే కరెక్ట్.. సీట్ల పెంపుపై కేంద్రానికి చామల కొత్త డిమాండ్!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×