E-Paper
Advertisement

Palnadu Explosion: బయోడీజిల్ బంక్‌లో బ్లాస్ట్.. ఇద్దరు స్పాట్..!

Palnadu Explosion: బయోడీజిల్ బంక్‌లో బ్లాస్ట్.. ఇద్దరు స్పాట్..!
Advertisement

Palnadu Explosion: పల్నాడు జిల్లా రెంటచింతల్ లో బయో డీజిల్ బంక్‌లో పేలుడు జరిగి ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డీజిల్ ట్యాంక్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని గురజాలకు చెందిన రషీద్‌గా గుర్తించారు.

ప్రస్తుతం పేలుడు జరిగిన కారణంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం డీజిల్ ట్యాంకు పేలడం, నిర్వహణలో లోపాలు, భద్రత చర్యలను పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

Advertisement

ఘటన తర్వాత గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు బంక్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇదిలా ఉంటే.. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని.. వస్త్ర దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

Advertisement

Also Read: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్ బస్సు-రెండు లారీలు ఢీ

భారీగా మంటలు చెలరేగడంతో.. షాపులో సామాగ్రి అంతా కాలిబూడిదైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×